34.7 C
Hyderabad
May 4, 2024 23: 23 PM
Slider పశ్చిమగోదావరి

దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలి

#Dalit Christians

దళిత క్రైస్తవులకు దళిత, ముస్లిం లకు రిజర్వేషన్ లు కల్పించాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చస్ ఇన్ ఇండియా కాథలిక్ భారత పీఠాధిపతుల సమాఖ్య ఆధ్వర్యం లో గురువారం ఏలూరు ఆర్ సి ఎం పీఠాధిపతి పొలిమేర జయరావు నేతృత్వం లో నిరసన ర్యాలీ నిర్వహించారు. భారత రాజ్యాంగం ప్రకారం దళితులకు మాత్రమే రిజర్వేషన్ లు కల్పించి క్రైస్తవ మతము స్వీకరించిన దళితులకు రిజర్వేషన్ లు దక్కకుండా కేంద్ర ప్రభుత్వం ఏళ్ళ తరబడి తిరస్కరిస్తుందని ఏలూరు ఆర్ సి ఎం పీఠాధి పతులు మోస్ట్ రెవరెండ్ బిషప్ పొలిమేర జయరావు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బిషప్ జయరావు మాట్లాడుతూ రాష్ట్రపతి ద్రౌపది మురము ప్రధాని మోడీ ఐక్య రాజ్య సమితి సారథ్యం లో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ల కల్పన పై రాజ్యాంగం లో సవరణలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా క్రైస్తవుల ఆధ్వర్యం లో ఏలూరు బిషప్ హౌస్ నుండి కలక్టరేట్ వరకు అఖిల భారత క్రైస్తవ సమాఖ్య పిలుపు మేరకు భారీ నిరసన తెలుపుతూ వేలాది మంది దళిత క్రైస్తవుల, దళిత ముస్లిం ల తో కలిసి నిరసన పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భం గా బిషప్ జయరావు మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగం లో 1950 లో భారత రాష్ట్ర పతి జారీ చేసిన ఉత్తర్వులతో 3వ పేరాననుసరించి దళిత క్రైస్తవుల కు దళిత రిజర్వేషన్ లను ఉద్దేశ పూర్వకంగా అంద నీయకుండా కేంద్ర ప్రభుత్వం కక్షపూర్వకంగా తిరస్కరిస్తుందని ఆరోపించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని బిషప్ పొలిమేర జయరావు అన్నారు. దళిత బౌద్ధులకు, దళిత సిక్కులకు మాత్రం రాజ్యాంగం సవరించి దళిత రిజర్వేషన్ లు కల్పిస్తున్న తీరు కేంద్ర ప్రభుత్వానికి దళిత క్రైస్తవుల పై పక్షపాత .

వివక్ష వైఖరికి ప్రత్యక్ష నిదర్శనమని కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ నిర్లక్ష్య క్రైస్తవ మత వ్యతిరేక దౌర్భాగ్య పరిస్థితుల వల్ల దళిత క్రైస్తవులు 72 ఏళ్లుగా దళిత రిజర్వేషన్ లు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా 1950 లోరాష్ట్రపతి దళిత క్రైస్తవులకు విరుద్ధంగా జారీ చేసిన ఉత్తర్వులతో 3 వ పేరాను సవరించి దళిత క్రైస్తవులకు దళిత ముస్లిం లకు దళిత రిజర్వేషన్ లు కల్పించాలని గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ ని కోరుతూ రాసిన వినతి పత్రాన్ని ఏలూరు జిల్లా కలెక్టర్ వె ప్రసన్న వెం కటేష్ కు ఆర్ సి ఎం పాదర్ ల, ముస్లిం పెద్దల బృందం తో కలిసి బిషప్ పొలిమేర జయరావు అందజేశారు.

Related posts

మధిరలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి కావాలి

Bhavani

ప్రొటెస్టు: ప్రభుత్వ చర్యపై అంగన్వాడి కార్యకర్తల నిరసన

Satyam NEWS

వినాయక నిమజ్జనానికి తిరుపతి అర్బన్ జిల్లా పోలీసుల ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment