28.7 C
Hyderabad
April 28, 2024 05: 39 AM
Slider ఖమ్మం

మధిరలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి కావాలి

#Collector VP Gautam

మధిర నియోజకవర్గ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ గుత్తేదారులు, అధికారులను ఆదేశించారు. పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి ఇండోర్ స్టేడియం మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణం పనులతో పాటు మడుపల్లి గ్రామంలో డంపింగ్ యార్డ్ కు అనుసంధానంగా నిర్మాణం చేపడుతున్న సిసి రోడ్డు పనులను పరిశీలించారు.

ఇండోర్ స్టేడియం పనులను పర్యవేక్షించిన కలెక్టర్ పనుల జాప్యంపై కాంట్రాక్టర్ను వివరణ అడిగారు. రూ.2 కోట్ల 65 లక్షలతో ఇండోర్‌ స్టేడియం నిర్మాణ పనులను ఉడెన్‌ వర్క్‌, ఫ్లోరింగ్‌ మ్యాట్‌ పనులను పరిశీలించారు. స్టోర్‌ రూమ్‌, బాలికల, బాలుర టాయిలెట్‌ బ్లాకులు, ఆఫీస్‌ గది నిర్మాణం జరుగుతున పనులు సెప్టెంబర్‌ నెల 15వ తేదీ లోపు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అన్నారు. అనంతరం 100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు తనిఖీ చేశారు.

గ్రౌండ్‌ ఫ్లోర్‌ స్లాబ్‌ పనులు పూర్తయినట్లు, ప్లాస్టింగ్‌ పనులు చేపట్టాలన్నారు. సమావేశ గది నిర్మాణానికి ప్రణాళిక చేయాలన్నారు.పర్యటనలో మధిర మున్సిపల్‌ పరిధిలో యానిమల్‌ భర్త్‌ కంట్రోల్‌ సెంటర్‌ను, 4వ వార్డు అంబేద్కర్‌ ఆడిటోరియం, 13వ వార్డు పాత డంపింగ్‌ యార్డ్‌, మడుపల్లి సి.సిరోడ్స్‌ పనులను పరిశీలించారు.

అనంతరం ఎర్రుపాలెం మహాత్మాజ్యోతిబాపూలే తెలంగాణ బిసి బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థినిలతో కలెక్టర్‌ ముచ్చటించారు. విద్యాబోధన సరళి, ర్యాంకుల లక్ష సాధన వివరాలను తెలుసుకున్నారు. వారితో కలిసి బోజనం చేశారు. విద్యార్థినిలు కలెక్టర్‌కు రక్షాబందన్‌ చేశారు.

Related posts

మంత్రిని దూషించిన బిజెపి నేతపై ఫిర్యాదు

Satyam NEWS

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

Satyam NEWS

అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీటీసీ

Satyam NEWS

Leave a Comment