29.7 C
Hyderabad
May 4, 2024 06: 47 AM
Slider నిజామాబాద్

దళితుల భూములను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

#Dalith Lands

కామారెడ్డి జిల్లా శాంతాపూర్ లోని వివాదాస్పద దళితుల భూములను జాయింట్ కలెక్టర్ నేడు పరిశీలించారు. బిచ్కుంద  మండలంలోని శాంతాపూర్ గ్రామంలో అటవి శాఖ దళితుల మధ్య భూముల వివాదం కొనసాగుతున్నది. అందులో భాగంగా జాయింట్  కలెక్టర్ యాదిరెడ్డి ఈ భూములను  గురువారం ఆర్డీఓ రాజేశ్వర్ తో  కలిసి సందర్శించారు. ఈ భూములు దళితులవే అని దళిత కుటుంబాలు అటవిశాఖ వని అటవీ అధికారులు చెబుతుండటంతో గత పదిహేను రోజుల నుండి సందిగ్ధత కొనసాగుతున్నది.

దళిత కుటుంబాలకు చెందిన వారు జిల్లా కలెక్టర్ కు సోమవారం రోజు    ఫిర్యాదు చేయడంతో విచారణ నిమిత్తం సంయుక్త కలెక్టర్ యాదిరెడ్డి ఆర్డీవో రాజేశ్వర్ జిల్లా అటవిశాఖ అధికారిణి వసంతలు గురువారం భూములను పరిశీలించారు. సర్వే అనంతరం భూములను అటవిశాఖ వా లేక రెవెన్యూ వ అన్నది తేల్చాల్సి ఉందని  పూర్తి విచారణ అనంతరం నివేదికలు ఉన్నతాధికారులకు అందించిన తర్వాతే పనులు చేపట్టాలని ఈ సందర్భంగా జెయి౦ట్ కలెక్టర్ స్పష్టం చేశారు.

అధికారులు గానీ ప్రజలు గానీ ఎవరికి ఎటువంటి ఇబ్బందులకు గురి చేసినా చట్టరీత్యా చర్యలు తప్పవని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జాయింట్ కలెక్టర్తో పాటు తహశీల్దార్ వెంకటరావు, ఎస్సై సాయన్న  రెవెన్యూ, అటవిశాఖ పోలీసులు పాల్గొన్నారు.

Related posts

8వ తేదీన పెద్దింటి అశోక్ ‘లాంగ్ మార్చ్’ పరిచయం

Satyam NEWS

కాంగ్రెస్ చింతన్ శివిర్: కుటుంబానికి ఒకటే టిక్కెట్

Satyam NEWS

నేను బతుకమ్మను

Satyam NEWS

Leave a Comment