37.2 C
Hyderabad
April 26, 2024 20: 14 PM
Slider కవి ప్రపంచం

నేను బతుకమ్మను

#Purimalla Sunanda New

బతుకు నిచ్చిన అమ్మను

పూల రూపంలో పూజింపబడే గౌరమ్మను

ప్రకృతిలో ప్రతి అణువు నేనై

ప్రపంచానికి ప్రాణం పోసిన విశ్వ మాతను!

చెమట చుక్కలతో సహవాసం చేసే

తెలంగాణ తల్లుల ఆడ పడచును

వాగులు వంకలు నిండిన ఋతువులో

ఒడలంతా పూల సోయగంతో మురిసిన ముదితను!

తీరొక్క పూలతో కొలువు తీరిన బతుకమ్మను

సబ్బండ జాతుల మహిళలు

ఆలపించే సమైక్యతా రాగాన్ని!

కష్ట సుఖాలను కలబోసుకునే

కమనీయమైన పండుగను

ఎంగిలి పూలతో ఎద ఎదనూ పలకరించి

సద్దుల బతుకమ్మ సంబురాన్నై

సలిలంలో నిమజ్జనమయ్యే బతుకమ్మను!

ఆడపడుచుల అస్తిత్వాన్నై

అనాదిగా గౌరవింపబడుతున్న దేవతను!

వురిమళ్ల సునంద, ఖమ్మం, 9441815722

Related posts

సుమాంజలి సీడ్స్ మిరప క్షేత్ర ప్రదర్శన

Murali Krishna

జన హృదయాల్లో నిలిచిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్

Satyam NEWS

పవన్ కు జనసేన ఎమ్మెల్యే వెన్నుపోటు

Satyam NEWS

Leave a Comment