Slider ముఖ్యంశాలు

అర్థగంటకో మరణం

#dogs

దేశ వ్యాప్తంగా అర్థగంటకో కుక్కకాటు మరణం సంభవిస్తున్నట్లు ఐసీఎంఆర్​(ఇండియన్ ​కౌన్సిల్​ ఆఫ్ ​మెడికల్ రీసెర్చ్) ప్రకటించింది. వీటిలో 70 శాతం వీధి కుక్కల కాటుతోనే జరుగుతున్నట్లు పేర్కొన్నది. దేశంలో ప్రస్తుతం సుమారు 2 కోట్ల కుక్కలుండగా, ప్రతి రెండు సెకన్లకు ఒకరిపై దాడి చేస్తున్నట్లు ఐసీఎంఆర్ ​స్పష్టం చేసింది. 93 శాతం మంది రేబిస్ ​వ్యాధికి గురై చనిపోతున్నారు. కుక్కలపై ఐసీఎంఆర్, ఢిల్లీ ఎయిమ్స్​ సంయుక్తంగా ఇటీవలే ఓ రీసెర్చ్‌ను నిర్వహించింది. ఆ సర్వేలో ఆందోళనకరమైన అంశాలను గుర్తించినట్లు ఐసీఎంఆర్ ​వెల్లడించింది. పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, వివిధ విభాగాల్లో సేవలు అందించేందుకు ప్రొఫెషనల్స్​ ఆధ్వర్యంలో పెరుగుతున్న కుక్కలపై సర్వే చేశారు. అయితే అత్యధికంగా వీధి కుక్కలతోనే ఇన్​ఫెక్షన్లు  ప్రబలుతున్నాయని, ఆ తర్వాత క్రమంగా రేబిస్ ​వ్యాధిగా మారి బాధితులు చనిపోతున్నట్లు వివరించారు. రేబిస్‌ కాకుండా వీధి కుక్కల ద్వారా బ్రుసిల్లోసిస్, బబేసియోసిస్, క్యాంపల్లో బ్యాక్ట్రోసిస్, క్రిప్టోపోరిడియాసిస్, క్యాపినోసైటో ప్యాగోసిస్, ఎకినోకొకోసిస్, ఎర్లికోసిస్, జియార్డియాసిస్, లెఫ్ట్రాస్పైరోసిస్, లైమ్‌ డిసీజ్‌ తదితర బ్యాక్టీరియా, ఫంగస్‌ జబ్బులు వస్తున్నాయని ఐసీఎంఆర్ ​హెచ్చరించింది. వీధి కుక్కల వల్ల ఇతర జంతువులు, పక్షులకు కూడా వైరస్‌లు వ్యాప్తి అవుతున్నాయి. ఆహారం తినే క్రమంలో రేబిస్‌ ఇతర జంతువులకు కూడా వ్యాపిస్తుంది. ఐదు రకాల వైరస్‌లు, రెండు రకాల బ్యాక్టీరియాలు కుక్కల ద్వారా ఇతర జంతువులకు వ్యాప్తి చెందుతున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. ప్రధానంగా పశువులకు ఎక్కువగా ఇన్ఫెక్ట్‌ అవుతున్నట్లు వెల్లడించారు.

Related posts

రామ‌తీర్ధం..నెల్లిమ‌ర్ల వాట‌ర్ వ‌ర్క్స్ ప‌రిశీలించిన విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌

Satyam NEWS

వృద్ధులను అక్కున చేర్చుకున్న బ్రాహ్మణ సమాఖ్య

Satyam NEWS

పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది.. ప్రజలు ఆందోళన చెందవద్దు

Bhavani

Leave a Comment