27.7 C
Hyderabad
May 14, 2024 05: 45 AM
Slider ఆధ్యాత్మికం

డిసెంబరు 30న శ్రీవారి ప్రణయకలహోత్సవం

tirumala

శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తన దేవేరులతో క‌లిసి పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం డిసెంబ‌రు 30వ తేదీ బుధ‌వారం తిరుమలలో జరుగనుంది.

ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4 గంట‌లకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ వరాహస్వామి ఆలయం వ‌ద్ద‌ ఒకరికొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూల‌బంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం నిర్వహిస్తారు.

ఈ ఉత్సవం కారణంగా బుధవారం పౌర్ణమి సందర్భంగా జరగాల్సిన పౌర్ణమి గరుడ సేవను టిటిడి రద్దు చేసింది.

Related posts

తొలకరి

Satyam NEWS

భారత్ ను తీవ్రంగా హెచ్చరించిన పాకిస్తాన్

Satyam NEWS

జర్నలిస్ట్ హబీబ్ ఖాన్ కుటుంబానికి ఆర్థిక సాయం

Satyam NEWS

Leave a Comment