29.7 C
Hyderabad
May 3, 2024 06: 09 AM
Slider ముఖ్యంశాలు

డెక్కన్‌ క్రానికల్‌ ఎండీ వెంకట్రామ్‌రెడ్డి అరెస్ట్‌

#MD Venkatram Reddy

డెక్కన్‌ క్రానికల్‌ మాజీ చైర్మన్‌ వెంకట్రామ్‌రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్ట్‌ చేసింది. కెనరా బ్యాంక్‌, ఐడీబీఏ బ్యాంక్‌లను మోసం చేసిన కేసులో ఈడీ అదుపులోకి తీసుకుంది. వెంకట్రామ్‌రెడ్డితో సహా మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసింది.

వీరిని కోర్టులో హాజరుపచిన అనంతరం రిమాండ్‌కు పంపనున్నారు. కాగా రూ. 8 వేల కోట్ల బ్యాంక్‌ ఫ్రాడ్‌ కేసులో వెంకట్రామ్‌రెడ్డిపై ఈడీ అభియోగాలు మోపింది.

పెద్ద మొత్తంలో రుణాలు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. రుణాలు ఎగవేసిన ఆరోపణలపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. తీసుకున్న రుణాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని ఆరోపించింది.

సీబీఐ కేసు ఆధారంగా వెంకట్రామ్‌రెడ్డిపై ఈడీ కేసు ఫైల్‌ చేసి దర్యాప్తు జరుపుతోంది. గతంలో వెంకట్రామ్‌రెడ్డికి చెందిన రూ,3,300 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఆయన పలు బ్యాంకుల్లో 8,800 కోట్ల రుణాలు తీసుకోగా.. వాటిని తిరిగి కట్టకుండా ఎగవేయడంతో ఈడీ దాడులు చేసింది.

Related posts

“మాతృదేవోభవ”(ఓ అమ్మ కథ) పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి!!

Satyam NEWS

అవినీతి పోలీసు అధికారికి డిమోషన్

Bhavani

బీసీల సభలో మంత్రి, సీఐపై విమర్శలు

Satyam NEWS

Leave a Comment