40.2 C
Hyderabad
May 2, 2024 16: 42 PM
Slider జాతీయం

అవినీతి పోలీసు అధికారికి డిమోషన్

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అవినీతిపై జీరో టాలరెన్స్ అవలంబిస్తూ పెద్ద చర్య తీసుకున్నారు. లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్/సీఓను ఇన్‌స్పెక్టర్‌గా చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదేశించారు. రాంపూర్‌ CO సిటీ విద్యా కిషోర్ శర్మ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై డీఐజీ విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఆరోపణ నిర్ధారణ కావడంతో ఆయన్ను బదిలీ చేశారు.

అనంతరం ప్రభుత్వం సస్పెండ్‌ చేసి శాఖాపరమైన విచారణ చేపట్టారు. నేరం రుజువుకావడంతో సీఓ స్థాయి వ్యక్తిని డిమోట్ చేసి ఇన్‌స్పెక్టర్‌గా చేశారు. ఇది అసాధారణ చర్యగా పోలీసు శాఖ భావిస్తున్నది. ముఖ్యమంత్రి ఈ విధమైన చర్యలు తీసుకోవడం వల్ల అవినీతిపరులకు భయం కలుగుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

అవినీతికి పాల్పడిన కంప్యూటర్ ఆపరేటర్ పై ఏసీబీ వల

Satyam NEWS

సోషల్ మీడియా గందరగోళం కొన్నాళ్లే: నిలబడేది ప్రధాన మీడియానే

Bhavani

నరసరావుపేటలో పెద్దఎత్తు కాగడాల ప్రదర్శన

Satyam NEWS

Leave a Comment