38.2 C
Hyderabad
May 5, 2024 22: 41 PM
Slider విజయనగరం

విజిబుల్ పోలీసింగుతో తగ్గిన రోడ్డు ప్రమాదాలు

#vijayanagarampolice

విజయనగరం జిల్లాలో నేరాలను, రోడ్డు ప్రమాదాలను, మహిళలపై దాడులను నియంత్రించేందుకు, శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఈ ఏడాది లో పోలీసు శాఖ సమర్ధవంతంగా పని చేసిందని జిల్లా ఎస్పీ దీపికా తెలిపారు. ఈ మేరకు డీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు.

విజిబుల్పో లీసింగుతో నేరాలను నియంత్రించగలిగామని, దిశా యాప్ పట్ల మహిళలను చైతన్యపర్చి, ఎక్కువమంది యాప్ ను డౌన్లోడు చేసుకొనే విధంగా చర్యలు చేపట్టి, మహిళలు స్వేచ్ఛగా ఫిర్యాదు చేసే విధంగా చర్యలు చేపట్టామని ఎస్పీ దీపికా తెలిపారు. మహిళల పై జరుగుతున్న దాడులను నియంత్రించేందుకు, చర్యలు చేపట్టేందుకు అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తూ, మహిళలు చేసే ఫిర్యాదులపై కేసులు నమోదు చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు.

2021 సం.లో జిల్లా వ్యాప్తంగా వివిధ నేరాల క్రింద 9, 136 కేసులు నమోదయ్యాయి. 2021 సంవత్సరంలో ఆస్తికి సంబంధించి 471 కేసులు నమోదుకాగా, వాటిలో 62 శాతం అనగా 293 కేసులు చేధింపబడగా, వాటిలో 50శాతం పోయిన ఆస్తిని (రూ. 1,21,90, 120/- 1 విలువైన వస్తువులను తిరిగి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆస్తికి సంబంధించిన నేరాలను నియంత్రించేందుకు, చైన్ స్నాచింగులను నియంత్రించేందుకు మఫ్టీలో పోలీసులను ప్రత్యేకంగా నియోగిస్తున్నామన్నారు. నేర నియంత్రణలో అవగాహన ఉన్న పోలీసు సిబ్బందిని ప్రజలు ఎక్కువగా తిరిగే రద్దీ ప్రాంతాల్లో గస్తే తిరిగే విధంగా నియమిస్తున్నామన్నారు.

మహిళలకు సంబంధించిన నేరాలు 2021 సం.లో 652 కేసులు నమోదయ్యాయన్నారు. మహిళలపై జరుగుతున్న దారుల పై ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలనే ప్రజల్లో అవగాహన కల్పించడం, దిశా డూప్ డౌన్లోడు చేసు కోవడం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిన కారణంగా ఫిర్యాదులు పెరిగాయని, ఈ ఫిర్యాదులను పోలీసుశాఖ తీవ్రంగా పరిగణించి, కేసులుగా నమోదు చేయడంతో కేసులు నమోదు సంఖ్య పెరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.

గుట్కాను అక్రమంగా తరలిస్తున్న వారి పై 146 కేసులు నమోదు చేసి, వారి వద్ద నుండి రూ. 1,15,90, 89 1/- ల విలువైన నిషేధిక గుట్కాలను పోలీసు స్వాధీనం చేసుకున్నారు. 2021 సం.లో అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిపైన, అక్రమంగా మద్యం కలిగివున్న వారి పైన 1,090 కేసులు నమోదు చేసి, వారి వద్ద నుండి 107,495 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి అక్రమ రవాణా పై ప్రత్యేకంగా నిఘా ఏర్పరిచి, 49 కేసులు నమోదు చేసి, 61మందిని అరెస్టు చేసి, రవాణాకు వినియోగించిన 34 వాహనాలను, 12, 863 కిలోల గంజాయిని పోలీలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలించే మార్గాలను గుర్తించి, ఆయా మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, అక్రమ రవాణాను నియంత్రించేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ తెలిపారు.

మద్యం, నాటుసారాను తరలించేందుకు వినియోగించిన 268 వాహనాలను పోలీసులు సీజ్ చేయడం జరిగిందన్నారు. అదే విధంగా కోర్టు అనుమతితో స్వాధీనం చేసుకున్న 6,011లీటర్ల నాటు సారాను ధ్వంసం చేసానున్నారు.

850 రోడ్డు ప్రమాదాలు జరగగా, వాటిలో 281 మంది మృతి చెందగా, 1191మంది గాయ పడినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. గత సంవత్సరం కంటే రోడ్డు ప్రమాదాల సంఖ్య 8 శాతం తగ్గిందన్నారు. రోడ్డు ప్రమాదాలకు ఎక్కువగా కారణమవుతున్న పూసపాటి రేగ, విజయనగరం ట్రాఫిక్, బొండపల్లి, డెంకాడ, భోగాపురం పోలీసు స్టేషన్లుగా గుర్తించి, వాటిలో ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ప్రమాదాలు జరగడానికి కారణాలను గుర్తించి, అక్కడ తుప్పులు తొలగించుట, రోడ్డు మరమ్మత్తులు చేపట్టడం, ప్రజలకు అవగాహన కల్పించడం, కషనరి బోర్డులను ఏర్పాటు చేయడం, రోడ్డు సేఫ్టీ వాహనాలను ఏర్పాటు చేసి, గస్తీని నిర్వహించి, ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టడం సత్ఫలితాలిచ్చిందని జిల్లా ఎస్పీ తెలిపారు.

7, 77 8మందిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసామన్నారు. అదే విధంగా అధిక లోడుతో వెళ్ళే వాహనాలపై 4, 679 కేసులు నమోదు చేసామన్నారు. రహదారి నిబంధనలు ఉల్లంఘించిన వారి పై 2, 22,942 కేసులు నమోదు చేసామన్నారు.

రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న ఆర్టీసి బస్సులపై 28 కేసులు, ప్రైవేటు బస్సులపై 9 కేసులు, లారీలు 104 కేసులు, కారు/జీపు/వ్యానులపై 185 కేసులు, ఆటోలపై 111 కేసులు, ద్విచక్ర వాహనాలపై 330 కేసులు, ట్రాక్టర్లు ఇతర వాహనాలపై 77 కేసులు నమోదు చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు.

వివిధ కోర్టుల్లో 1,997 కేసులు డిస్పోజ్ కాగా, వాటిలో 3,852 కేసుల్లో నిందితులకు (71 శాతం) శిక్షలు పడినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. లోక్ అదాలత్ లో 4,052 కేసులు డిస్పోజ్ అయ్యాయన్నారు. ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించి బాల కార్మికులుగా పని చేస్తున్న 165 బాల, బాలికలను గుర్తించి, వారు తిరిగి చదువుకొన విధంగా చర్యలు చేపట్టామన్నారు. కార్మికులుగా వివిధ పనులు చేస్తున్న బాలల తల్లిదండ్రులకు కౌన్సిలింగు నిర్వహించామన్నారు.

నేరాల్లో అరెస్టు కాబడిన నిందితులపై నిఘా ఏర్పరిచేందుకుగాను 170 హిస్టరీ షీటులకు క్రొత్తగా ప్రారంభించగా, వాటిలో రౌడీ షీటులు: – 80, సస్ఫెక్ట్ షీటులు – 104, డిసి షీటులు – 8 వున్నాయన్నారు. మంచి ప్రవర్తనతో జీవిస్తున్నట్లుగా 29 మందిని గుర్తించి, వారి పై గతంలో కలిగిన హిస్టరీ షీట్లును మూసి వేసామన్నారు.

టూటౌన్ పోలీసు స్టేషనులో 2016లో కేతవరపు సత్యన్నారాయణ అనే వ్యక్తి అదృశ్యం కాగా, సదరు వ్యక్తి హత్య గావింపబడినట్లుగా 2021లో గుర్తించామన్నారు. పోలీసులు వాహన తనిఖీలు చేపట్టి అదృశ్యం అయిన వ్యక్తికి వినియోగించిన వాహనంను గుర్తించి, విచారణ చేపట్టి, కేతవరపు సత్యన్నారాయణను హత్య గావించినట్టుగా గుర్తించి, నిందితులను అరెస్టు చేసి, వారి నుండి ద్విచక్ర వాహనం, బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు.

రికార్డు స్థాయిలో స్పందన ఫిర్యాదుల పరిష్కారం

“స్పందన” కార్యక్రమంలో 739 ఫిర్యాదులు స్వీకరించి, వాటిలో 174 ఎఫ్.ఐ.ఆర్.లుగాను, 446 ఫిర్యాదులను పరిష్కరించగా, ఇంకనూ 119 ఫిర్యాదులు పెండింగులో ఉన్నాయన్నారు. స్పందనకు వచ్చిన ఫిర్యాదుల్లో చాలా వరకు భూములు, ఇండ్లుకు, కుటుంబ కలహాలు, చీటింగు, పెండ్లికి నిరాకరించినవి ఎక్కువగా ఉన్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు.

4,371 సిసి కెమెరాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసి, నేరాలను నియంత్రణ పై నిఘా ఏర్పాటు చేసామన్నారు. మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్ తో అనుమానస్పద వ్యక్తుల వేలిముద్రలను తనిఖీ చేసి, 61 మందిని పాత నేరస్థులుగా గుర్తించామన్నారు.

మహిళలపై నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న 225 ప్రాంతాలను గుర్తించి, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడం, ఆయా ప్రాంతాల్లో మహిళలు ఒంటరిగా వెళ్ళకుండా గస్తీ నిర్వహించడం చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతాలను వల్నరబుల్ పాయింట్లుగా వ్యూపింగు చేసామని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు మహిళా సంరక్షణ పోలీసుల సహాయం తీసుకుంటున్నామన్నారు. ఈ ప్రాంతాల పై కొన్నిసార్లు డ్రోన్ కెమెరాలతో నిఘా కూడా ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

దిశా యాప్ మీద మహిళలకు అవగాహన కల్పించి, ఇప్పటి వరకు 4,05,4511 మంది డౌన్లోడు చేసుకొనే విధంగా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో దిశా యాప్ పట్ల అవగాహన కల్పించేందుకు నిరంతరం చర్యలు చేపడుతున్నా మన్నారు. అదే విధంగా మూడు ప్రీ బస్సులను ఏర్పాటు చేసి, రూప్ చూపిన వారికి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే విధంగా చర్యలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. రాత్రి సమయాల్లో వల్నరబుల్ ప్రాంతాల్లో మహిళా కానిస్టేబుళ్ళు గస్తీ తిరిగే విధంగా ప్రత్యేకంగా వుమెన్ సేఫ్టీ ఓటును కూడా వేస్తున్నామని, మహిళల రక్షణకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.

క్రమం తప్పకుండా వాహనాల తనిఖీ

విజిబుల్ పోలీసింగులో భాగంగా జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు చేపట్టి, మోటారు వాహన చట్టంను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. విజిబుల్ పోలీసింగుకు ప్రత్యేకంగా రెండు హాక్వా హనాలను ప్రత్యేకంగా వినియోగిస్తున్నామన్నారు. ఈ వాహనాల్లో జీపీఎస్, వైర్ లెస్ సెట్, సీసీ కెమెరాలు ప్రత్యేకంగా అమర్చి ఉంటాయన్నారు. అదే విధంగా 9 రోడ్డు సేఫ్టీ వాహనాలను కూడా ఏర్పాటు చేసామన్నారు.

ఈ వాహనాలను జాతీయ, రాష్ట్రీయ రహదారాల పై గస్తీ తిరుగుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టడంతోపాటు, ప్రజలకు అవగాహన కల్పించడం, గాయపడిన వారికి ప్రధమ చికిత్స అందించి, వారిని గోల్డెన్ అవర్స్ లో ఆసుపత్రికి తరలించి, ప్రాణాలు కాపాడుతున్నామన్నారు.

గిరి శిఖర గ్రామాలలో మెడికల్ క్యాంపులు

కమ్యూనిటీ పోలీసింగులో భాగంగా ఏజన్సీ ప్రాంతాల్లోని గిరి శిఖర గ్రామాలను సందర్శించి మెడికల్ క్యాంపులు నిర్వహించి, మందులను, నిత్యావసర వస్తువులను, క్రీడా పరికరాలను పంపిణీ చేసామన్నారు. అంతేకాకుండా, వారు తీవ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా ఉపాధి కల్పించే వృత్తి నైపుణ్య కోర్సులను నేర్పిస్తున్నామన్నారు.

ప్రమాదాల్లో మృతి చెందిన పోలీసు కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు “చేయూత” కొంత మొత్తాన్ని పోలీసు ఉద్యోగులు అందిస్తున్నారు. అదే విధంగా 9 పోలీసు కుటుంబాలకు రూ. 17, 15,800 అందించామన్నారు.

కానిస్టేబులు నుండి ఇన్స్ పెక్టరు వరకు పోలీసుశాఖలో పని చేస్తున్న వారికి వారంతపు సెలవు అమలు చేస్తున్నామన్నారు. 50మంది కానిస్టేబుళ్ళుకు హెడ్ కానిస్టేబుళ్ళుగాను, 21 మంది ఎఎస్ ఐలుగా ఉద్యోగోన్నతులు కల్పించా మన్నారు. ప్రతీ శుక్రవారం పోలీసు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు వెల్ఫేర్ దివస్ ను నిర్వహిస్తున్నా మన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఈబి అదనపు ఎస్పీ ఎన్. శ్రీదేవీరావు, పార్వతీపురం ఓఎస్డీ ఎన్. సూర్యచంద్రరావు, అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, విజయనగరం డిఎస్పీ అనిల్ పులిపాటి, ఎస్బీ సిఐలు ఎన్.శ్రీనివాసరావు, జి.రాంబాబు, రుద్రశేఖర్, వన్ టౌన్ సీఐ జె.మురళి, ఆర్.ఐ పి.నాగేశ్వరరావు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

రాములవారి కల్యాణోత్సవంలో అలరించిన భజన సంగీతం

Satyam NEWS

చీఫ్ జస్టిస్ వ్యాఖ్యల నేపథ్యంలో జడ్జిల దూషణ కేసులో మరి కొందరి అరెస్టు

Satyam NEWS

ఆటా(ATA)లో ఎన్నికల హోరు: డబ్బు పవర్ పని చేసేనా?

Bhavani

Leave a Comment