28.7 C
Hyderabad
April 27, 2024 03: 42 AM
Slider నిజామాబాద్

వడగళ్ల వానతో నష్టపోయిన పంటల్ని పరిశీలించిన స్పీకర్

#speaker

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలంలో నిన్న రాత్రి కురిసిన వడగళ్ళ వానతో దెబ్బతిన్న పంటలను తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. హెగ్డోలి, యాద్గార్ పూర్, వల్లవాపూర్, దోమలెగ్డి, టాక్లి, రాంగంగానగర్ గ్రామాల పరిధిలో దెబ్బతిన్న పొద్దుతిరుగుడు, శనగ, మినుము, కూరగాయల పంటలను క్షత్రస్థాయిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అకాల వడగళ్ళ వానతో నష్టపోయిన రైతులను ఓదార్చారు.  జరిగిన నష్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని తెలిపారు. వ్యవసాయ అధికారులు తక్షణమే క్షేత్ర స్థాయిలో పర్యటించి జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం రైతులకు అవసరమైన సహాయాన్ని సొసైటీల ద్వారా అందించాలని స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులకు సూచించారు.

Related posts

విజ‌య‌న‌గ‌రం డీఎస్పీ అనిల్ కు పదోన్న‌తి…న‌ర్సీప‌ట్నం ఏఎస్పీగా బాధ్య‌త‌లు…?

Satyam NEWS

జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్ హీరోగా క్రేజీ చిత్రం “పీప్ షో” టీజర్ విడుదల

Satyam NEWS

అస్వస్థతకు గురైన అన్నా హజారే.. ఆస్పత్రికి తరలింపు

Sub Editor

Leave a Comment