23.2 C
Hyderabad
May 7, 2024 21: 46 PM
Slider ముఖ్యంశాలు

తొలగించిన ఓట్లను మరోసారి పరిశీలించాలి

#Election commions

ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలన చేసి ధృవీకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. హైదరాబాద్ నుండి ప్రధాన ఎన్నికల అధికారి, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్ తో కలిసి జిల్లా కలెక్టర్లతో ఓటర్ జాబితాలో పి.ఎస్.ఈ ఎంట్రీ ధృవీకరణ, ఓటర్ ఎపిక్ కార్డుల జారీ, బూత్ లెవెల్ అధికారుల నియామకం తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఫోటో సిమిలర్ ఎంట్రీ మొదటి దఫా క్రింద క్షేత్ర స్థాయిలో తొలగించిన ఓట్ల వివరాలు మరోసారి పరిశీలించాలని సూచించారు. జిల్లాలో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన, మరణించిన వారి పేర్లు, డూప్లికేట్ ఓట్లు జాబితా నుంచి తొలగించామని, తొలగించిన ఓట్లకు సంబంధించి సంపూర్ణ సమాచారం తమ వద్ద అందుబాటులో ఉండాలని, తొలగించిన ఓట్ల వివరాలు మరోసారి పరిశీలించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అవసరమైన డాక్యుమెంట్లు ఉన్నాయో లేవో ధ్రువీకరించాలని ఆయన తెలిపారు.

ఓటరు జాబితా రూపకల్పనలో బూత్ స్థాయి అధికారులు కీలకపాత్ర పోషిస్తారని, ప్రైవేట్ వ్యక్తులను బూత్ స్థాయి అధికారులుగా నియమించవద్దని, ఎక్కడైనా అలా ఉంటే ఏడు రోజులలో తొలగించి ప్రభుత్వ సిబ్బందినీ నియమించాలని ఆయన సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఓటర్ల జాబితా పై పలు సూచనలు చేసి మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న ఫోటో సిమిలర్ ఎంట్రీలను ఆర్డీవోలు, తహసిల్దార్ లు ప్రత్యేకంగా పరిశీలించాలని, అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించాలని తెలిపారు.

ఓటరు జాబితా నుంచి తొలగించిన పేర్ల వివరాలు మరోసారి పరిశీలించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేర డాక్యుమెంట్లు సంతకాలు ఉన్నాయో లేవో తనిఖీ చేయాలని కలెక్టర్ రెవిన్యూ డివిజన్ అధికారులను, తహసిల్దారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, ప్రత్యేక ఉప కలెక్టర్ దశరథం, కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ, కలెక్టరేట్ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ రాంబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

గ‌జ వాహ‌నంపై లోకమాత శ్రీ ప‌ద్మావ‌తి అభయం

Satyam NEWS

‘బ్యాక్ డోర్’ గీతం ఆవిష్కరించిన రాజకీయ సంచలనం వైఎస్ షర్మిల

Satyam NEWS

జగనన్నే మా భవిష్యత్తు  కార్యక్రమం విజయవంతం

Satyam NEWS

Leave a Comment