29.7 C
Hyderabad
May 3, 2024 06: 46 AM
Slider గుంటూరు

జగనన్నే మా భవిష్యత్తు  కార్యక్రమం విజయవంతం

#marrirajasekhar

ఏప్రిల్ 7 వ తేదీన, వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా “జగనన్నే మా భవిష్యత్తు” పేరుతో మెగా పీపుల్స్ సర్వేను ప్రారంభించింది. ఇందులో 7 లక్షల మంది పార్టీ సైనికులు ప్రతి ఇంటిని సందర్శించి, ప్రజలు వారికోసం వారిపిల్లల భవిష్యత్తు కోసం ఎవరిని విశ్వసిస్తున్నారనే అంశంపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించారు. జగనన్నే మా భవిష్యత్తు  కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ “జగనన్నే మా భవిష్యత్తు” పేరుతో నిర్వహించిన మెగా పీపుల్స్ సర్వే ఫలితాలను గర్వంగా వెల్లడిస్తున్నామన్నారు. 1.1 కోట్ల మిస్డ్ కాల్స్ ప్రజల నుంచి వచ్చాయని తెలిపారు. ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఏ పార్టీ కూడా చేపట్టనటువంటి గొప్ప కార్యక్రమన్ని వైసీపీ చేపట్టిందన్నారు. 1.45 కోట్ల కుటుంబాలను వైసీపీ శ్రేణులు కలిస్తే అందులో 80 శాతం మంది… అంటే 1.1 కోట్ల మంది జగన్ పట్ల వారి విశ్వాసాన్ని తెలియజేశారని తెలిపారు.

జగన్ చేపట్టిన కార్యక్రమాల వలన ప్రజలే కాకుండా వారి పిల్లల ద్వారా తెలియజేయడం జరిగిందిని వివరించారు. ప్రజా  మద్దతు పుస్తకాల ద్వారా ఇంటింటికి వెళ్లి సేకరించారని అన్నారు. 4 ఏళ్లలో ప్రజలకు అందిన సంక్షేమ- అభివృద్ధి పథకాల ద్వారా ఎంత మేరకు సంతృప్తిగా ఉన్నారనే దానిపై సంపూర్ణమైన విశ్వాసాన్ని వెల్లడించారని స్పష్టం చేశారు.  ప్రజలందరూ కూడా జగన్ కి జైజైలు పలుకుతున్నారని చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు, జగన్ పట్ల ఇంత నమ్మకాన్ని పెట్టుకున్న ప్రజలకు రుణపడి ఉంటామని అన్నారు.

Related posts

అభివృద్ధి పనులకు భూమిపూజ శంకుస్థాపన

Satyam NEWS

చంద్రబాబుకు మధ్యంతర బెయిల్

Satyam NEWS

విశాఖ ఉక్కు అమ్మేస్తున్న బీజేపీ కి మద్దతు ఇవ్వడం సిగ్గు చేటు

Satyam NEWS

Leave a Comment