32.2 C
Hyderabad
May 13, 2024 22: 02 PM
Slider ఖమ్మం

సకాలంలో సరుకులు అందించాలి

#Madhusudan Naik

ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక ధర దుకాణాల ద్వారా వినియోగదారులకు సకాలంలో సరుకులు అందించాలని ఖమ్మం అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. స్థానిక జెడ్పి సెంటర్, చర్చ్ కాంపౌండ్, ప్రకాష్ నగర్ లలోని చౌక ధరల దుకాణాలను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాలలో నిర్వహించే స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ తెలిపే బోర్డులు, బయోమెట్రిక్ ఈ-పాస్ యంత్రాలను పరిశీలించారు.

సమయ పాలన పాటించాలని, ఉదయం 8.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఖచ్చితంగా దుకాణాలు తెరిచి వుంచాలని ఆయన తెలిపారు. ప్రతి షాపులో ఆర్డీవో చే జారీచేసిన ఆథరైజేషన్ సర్టిఫికెట్ ప్రదర్శించాలన్నారు. మూసివున్న, ఆథరైజేషన్ సర్టిఫికెట్ ప్రదర్శించని దుకాణాలకు షోకాజ్ నోటీసు జారిచేసినట్లు ఆయన తెలిపారు. ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్లు, నిబంధనలు పాటించని దుకాణాలపై చర్యలు చేపట్టనున్నట్లు అదనపు కలెక్టర్ అన్నారు.

Related posts

బిజెపి పాలనపై పీడత ప్రజలు పోరాడాల్సిన సమయం ఇది

Satyam NEWS

పేదింటి బిడ్డ ఎంబిబిఎస్ కు సాయం అందించిన ఎమ్మెల్యే కోనప్ప

Satyam NEWS

వ‌ర‌ద స‌హాయంపై బుర‌ద రాజ‌కీయాలు

Sub Editor

Leave a Comment