23.2 C
Hyderabad
May 7, 2024 22: 48 PM
Slider మెదక్

బిజెపి పాలనపై పీడత ప్రజలు పోరాడాల్సిన సమయం ఇది

#CPMDubbaka

దేశంలో కరోనా రెండో వేవ్ విజంభిస్తున్న సందర్భంగా దేశంలో అధికారంలో ఉన్న మతోన్మాద బిజెపి ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి గుళ్ళూ, గోపురాలు,విగ్రహాల, చుట్టూ తిరుగుతున్నదని సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు జి భాస్కర్ అన్నారు.

కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 36 వ వర్ధంతి సందర్భంగా దుబ్బాక లో  సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ పాలక బిజెపి దేశాన్ని తిరోగమన స్థితికి తీసుకెళ్తుందని విమర్శించారు.

మతోన్మాద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలోని శ్రామికవర్గం,పీడిత ప్రజానీకం, ప్రజానీకం ఐక్యమత్యంతో పోరాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. దోపిడీ లేని సమసమాజం కోసం మరో పోరాటాలకు సన్నద్ధం కావాలని అప్పుడే  ప్రజలకు మేలు జరుగుుందన్నారు. కరోనా విపత్తు నుండి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

గ్రామీణ స్థాయి నుండి ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ప్రభుత్వం తగు బడ్జెట్ కేటాయించి కరోనా నిర్మూలన కోసం దోహదపడాలని పిలుపునిచ్చారు.

అప్పటివరకు ప్రైవేట్ ఆస్పత్రులను జాతీయం చేయాల్సిన అవసరం ఉందని అప్పుడే ప్రజలకు నిజమైన వైద్యాన్ని అందించగలమని అన్నారు. సుందరయ్య పోరాటయోధుడని వర్గ పోరాటమే ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుందని నమ్మిన వ్యక్తి అని ఆయన తెలిపారు.

పోరాట పంథానే ఈ దోపిడీ వ్యవస్థను అంతం చేసి దోపిడీ, పీడన లేని సమ సమాజాన్ని స్థాపిస్తుందని నమ్మి తన జీవితాన్ని కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితం చేసిన మహనీయుడు అని కొనియాడారు.నిరంకుశ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1946 నుండి 51 వరకు వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా క్రియాశీలక పాత్ర వహించిన మహానీయుడని తెలిపారు.

కుల వివక్షకు వ్యతిరేకంగా అంటరానితనానికి వ్యతిరేకంగా ఆ రోజుల్లోనే తమ ఇంటి నుండే సహపంక్తి భోజనాలు ఏర్పాటు కృషిచేసిన మహానీయుడని తెలిపారు.

ఆ రోజు నుండి ఈ రోజు వరకు సుందరయ్య బాటలో సిపిఎం పార్టీ నిరంతరం ప్రజల సేవ కోసం పనిచేస్తుందని. దోపిడీ,పీడన, వివక్ష అంటరానితనానికి వ్యతిరేకంగా సమ సమాజ నిర్మాణం కోసం సమసమాజ స్థాపన కోసం అవిశ్రాంతంగా పని చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పెంటి సాయి కుమార్,క్రాంతి,మహేష్,రాజు, రమేష్,తదితరులు పాల్గొన్నారు.

Related posts

మురుగన్ పై 112 పేజీల అభియోగ పత్రం

Satyam NEWS

5వ రాష్ట్ర ఆర్థిక కమిషన్ ను వెంటనే నియమించాలి

Satyam NEWS

శాల్యూట్: సర్వసత్తాక గణతంత్రం మన భారతం

Satyam NEWS

Leave a Comment