26.7 C
Hyderabad
May 3, 2024 08: 10 AM
Slider జాతీయం

నోయిడా ట్విన్‌ టవర్స్‌‌ను కూల్చాల్సిందే.. సుప్రీంకోర్టు

నోయిడా లోని ట్విన్‌ టవర్స్‌ను కూల్చాల్సిందే అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఒక్క టవర్‌కు మినహాయింపు ఇవ్వాలన్న సూపర్‌టెక్‌ సంస్థ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. ఢిల్లీ శివార్ల లోని నోయిడా అక్రమంగా నిర్మించిన ట్విన్‌ టవర్స్‌ విషయంలో సూపర్‌టెక్‌ బిల్డర్స్‌కు సుప్రీంకోర్టు మరోసారి షాకిచ్చింది. ట్విన్‌ టవర్స్‌ను తాము విధించిన గడువులోగా కూల్చాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

నోయిడా లోని ఎమిరాల్డ్‌ కోర్టు ప్రాజెక్ట్‌లో భాగంగా 40 అంతస్తుల ట్విన్‌ టవర్స్‌ను నిర్మించింది సూపర్‌టెక్‌ సంస్థ. అయితే నిబంధలను విరుద్దంగా ఈ టవర్స్‌ను నిర్మించారని, అధికారులు ముడుపులు తీసుకొని అనుమతులు ఇచ్చారని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై సుదీర్ఘంగా విచారణ జరిగింది.

సుప్రీంకోర్టు తీర్పు తరువాత నోయిడా డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారులపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ట్విన్‌ టవర్స్‌కు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంది యూపీ ప్రభుత్వం. ట్విన్‌ టవర్స్‌లో ఫ్లాట్స్‌ బుకింగ్స్‌ చేసుకున్న ప్రజలకు డబ్బును వెంటనే చెల్లించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

రెండు నెలల్లోగా డబ్బులు చెల్లించాలని సూపర్‌ టెక్‌ బిల్డర్స్‌కు ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. ట్విన్‌ టవర్స్‌ను కూల్చివేస్తే కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని, పర్యావరణానికి కూడా హానీ జరుగుతుందన్న సూపర్‌టెక్‌ బిల్డర్స్ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. 2014లోనే ట్విన్‌ టవర్స్‌ను కూల్చేయాలని అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సూపర్‌టెక్‌ బిల్డర్స్‌ సుప్రీంకోర్టు వెళ్లినప్పటికి కూడా చుక్కెదురయ్యింది.

Related posts

చంద్రబాబు వేలుకు ఉంగరం…. ఎందుకో వివరించిన అధినేత

Satyam NEWS

టీటీడీ డిసిషన్:85 టన్నుల నాణాలను కరిగిస్తాం

Satyam NEWS

ప్రేక్షకులకు చెప్పాల్సిన కథ ‘యశోద’

Bhavani

Leave a Comment