37.2 C
Hyderabad
May 6, 2024 19: 08 PM
Slider జాతీయం

అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ కు డాక్టర్ డి.కె సిన్హా

director

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ అటామిక్ ఎనర్జీ లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ రిసర్చ్(ఏ.ఎమ్.డి) డైరెక్టర్ గా  డాక్టర్ డి.కె. సిన్హా (సైంటిఫిక్ ఆఫీసర్ హెచ్ +) నియమితులయ్యారు.  ఈ పదవిని చేపట్టడానికి ముందు,  డాక్టర్ డి.కె. సిన్హా ఇదే డైరెక్టరేట్‌లో అదనపు డైరెక్టర్‌గా పని చేశారు.

డాక్టర్ సిన్హా, మధ్యప్రదేశ్, సాగర్ లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయం నుండి అనువర్తిత భూగర్భ శాస్త్రం (అప్లైడ్ జియాలజీ)లో ఎం.టెక్ పొందిన తరువాత 1984 లో ఎ.ఎమ్.డి  లో చేరారు. నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం నుంచి 1993 లో భూగర్భ శాస్త్రంలో పిహెచ్.డి. డిగ్రీ పూర్తి చేశారు. భారతదేశంలోని తూర్పు, పశ్చిమ మరియు మధ్య భాగాల భిన్నమైన భౌగోళిక డొమైన్‌లలో 35 ఏళ్లుగా విస్తరించి ఉన్న అణు ఖనిజాల అన్వేషణలో ఆయనకు విశేష  అనుభవజ్ఞానం ఉంది.

ఆయన అన్వేషణ వ్యూహం మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ , రాజస్థాన్, ఝార్ఖండ్ రాష్ట్రాలలో పెద్ద ఎత్తున అణు ఖనిజాల నిక్షేపాలను పెంచింది. డాక్టర్ సిన్హా అన్వేషణ భూగర్భ శాస్త్రానికి అంకితమైన పరిశోధకుడు. దేశంలో యురేనియం అన్వేషణ ప్రోగ్రామ్‌లో విస్తృతంగా ఉపయోగిస్తున్న అనేక కొత్త అంశాలను ఆయన ప్రచురించారు.

 యూనివర్శిటీ, పరిశోధన  సంస్థలతో సహకరించడానికి అతని భౌగోళిక చతురతను వివిధ విద్యావేత్తలు అనేక సింపోజియంలలో, సెమినార్లు, శిక్షణ, సహకార ప్రాజెక్టుల వంటి అనేక కార్యక్రమాలలో ప్రశంసించారు. జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ లో అనేక పరిశోధనా కథనాలను డాక్టర్ సిన్హా ప్రచురించారు.  

ఆయనకు 100 కి పైగా అనులేఖనాలు ఉన్నాయి. వివిధ జాతీయ, అంతర్జాతీయ సంఘాలలో జీవిత కాల  సభ్యుడుగా ఉన్నారు.  భౌగోళిక అన్వేషణలో అనుభవం సంపాదించడానికి డాక్టర్ సిన్హా దేశం మొత్తం విస్తృతంగా తిరిగారు.

Related posts

నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి

Satyam NEWS

మార్చి 14 నుండి తిరుమలలో ఫాల్గుణ మాస ఉత్స‌వాలు

Satyam NEWS

5గురు బెంగాల్ కూలీలను హతమార్చిన ఉగ్రవాదులు

Satyam NEWS

Leave a Comment