29.7 C
Hyderabad
May 4, 2024 04: 53 AM
Slider ముఖ్యంశాలు

కొనసాగుతున్న అల్పపీడనంతో వర్ష సూచన

WeatherReport

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది. ఇది రానున్న రెండురోజుల్లో మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. బంగాళాఖాతం నుంచి తేమతో నిండిన తూర్పు పవనాలు తీరం మీదుగా ఉత్తరభారతానికి వీస్తున్నాయి.

వీటన్నిటి ప్రభావంతో నేడూ రేపూ కోస్తాంధ్ర, యానం, తెలంగాణల్లో అక్కడక్కడ విస్తారంగా వర్షాలు పడతాయి. రాయలసీమకు చెదురుమదురు వర్షాలు పడతాయి.

నేడు తెలంగాణకన్నా కోస్తాంధ్రలో అధిక వర్షాలు పడవచ్చు. రేపు ఉభయ రాష్ట్రాలకూ భారీ వర్ష సూచన ఉంది. ఉత్తర బంగాళాఖాతం, దాన్ని ఆనుకున్న ప్రాంతాల్లో 50-60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

మత్స్యకారులు ఆ ప్రాంతాల్లోకి వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Related posts

గుంటూరులో 13 బైకులను తగులబెట్టిన ఆకతాయిలు

Satyam NEWS

హ్యుమానిటీ:కురిక్యాల బాధితులకు నష్టపరిహారం

Satyam NEWS

హెల్ప్ డెస్క్ లో పూర్తి సమాచారం ఉండాలి

Satyam NEWS

Leave a Comment