గుంటూరు జిల్లా నల్లచెరువులో ఆకతాయిల ఆగడాలు పెచ్చుమీరాయి. ఇళ్ల ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. 13 బైకులను తగులబెట్టారు. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనతో స్థానికులు విస్తుపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల దృశ్యాలు పరిశీలిస్తున్నారు.