37.2 C
Hyderabad
April 30, 2024 12: 07 PM
కవి ప్రపంచం

మహోన్నతుడు మాహీ

#Sandhya Sutravey

అత్యున్నత క్రికెట్ దిగ్గజం

టీం ఇండియా సారథి

మ్యాచ్ల గెలుపుకు వారధి

ఎన్నో మ్యాచులను అలవోకగా

నెగ్గిన నిగర్వి

ఓర్పు నేర్పులకు చిరునామా

వ్యూహాలు పన్నుటలో దిట్ట

అతనికి సొంతం మ్యాచ్ విజయాల చిట్ట

ఎన్నో క్రీడాకారులకు ఊరట

ఆలంబన ప్రేరణ

తోటి ఆటగాళ్ళ క్రీడాసక్తిని ,పటిమను

ఎరిగిన మాంత్రికుడు

తదనుగుణంగా వారిని

ఉపయోగించి విజయాల

పరంపర సాగించిన ధీరుడు

కెప్టెన్ కూల్ గా,ధనాధన్

హెలికాప్టర్ షాట్స్ మాహీ స్టైల్ గా

ఝార్ఖండ్ డైనమైట్ గా

రాంచీ వీరుడిగా పేరొంది

ఐసిసి ట్వెంటీ ట్వెంటీప్రపంచకప్ 2007

ఐసిసి ప్రపంచకప్ 2011

ఛాంపియన్ ట్రోఫీలను నెగ్గినా

అంతర్గతంగా అద్భుతఫుట్బాల్

ఆటగాడిగా ఉండి

పద్మశ్రీ, పద్మభూషణ్,

రాజీవ్ ఖేల్ రత్న అవార్డులతో

గౌరవడాక్టరేట్లతో అలరారి

సాక్షికి వరమై, జీవాకు వశమై

అత్యుత్తమ ప్రతిభను

ప్రదర్శిస్తూనే ఎవరి ఊహలకందకుండా

ఆశ్చర్య పరుస్తూ

పంద్రాగస్టు పర్వదినాన

తన రిటైర్ మెంట్ ప్రకటనను

తనదైన రీతిలో

ఎవరికి ఏది శాశ్వతం కాదు

పాత దాని స్థానే కొత్తది

తప్పక వస్తుంది, ఇది ఒక

నిరంతరం ప్రవాహ ప్రక్రియ

అని తత్త్వం ఉట్టిపడే పాటను

జోడించి అందరి హృదయాలను

ద్రవించేలా గౌరవంగా

ఆటనుండి తప్పుకొంటున్నానని

ప్రకటించిన ఆదర్శుడు

మహేంద్రసింగ్ ధోని

నిజంగా మహోన్నతుడిగా

మహిచరిత్రలో నిలుస్తాడు

ఇది తథ్యం

సంధ్య సుత్రావె, సుల్తాన్ షాహి ,హైదరాబాద్

Related posts

మధుర కవి

Satyam NEWS

2021

Satyam NEWS

స్థిత ప్రజ్ఞాశాలి పీవీ

Satyam NEWS

Leave a Comment