28.7 C
Hyderabad
April 28, 2024 10: 38 AM
Slider రంగారెడ్డి

హరితహారంలో మల్టీలేయర్ పద్ధతిలో మొక్కల పెంపకం

#vikarabad

వికారాబాద్ జిల్లాలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మన్నెగూడ నుండి వికారాబాద్ మెయిన్ రోడ్డు మరియు బీజాపూర్ హైవే రోడ్డుకు ఇరువైపులా మల్టీ లేయర్ పద్దతిలో నాణ్యమైన పెద్ద సైజు  రెండు వేల మొక్కలు కొనుగోలు చేసి నాటేందుకు తాండూర్ నాపరతి క్రషింగ్ అసోసియేషన్ సహకారం అందించడం సంతోషదాయకమని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. 

శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో   ఏడి మైన్స్ శాఖ ఆధ్వర్యంలో  స్టోన్ అండ్ క్రషింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చైతన్య, సభ్యులు జిల్లా కలెక్టర్ ను ప్రత్యేకంగా కలసి అందుకు సంబంధించిన చెక్కును అందించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి హరితహారంలో గతంలో కన్నా భిన్నంగా అవెన్యూ ప్లాంటేషన్ లో మొక్కలు నాటి వికారాబాద్ ను గ్రీన్ సిటీగా మారుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏ డి మైన్స్ సాంబశివారావు, డి ఆర్ డి ఓ కృష్ణన్ స్టోన్ అండ్ క్రషింగ్ యూనియన్ ప్రెసిడెంట్ చైతన్య, సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి తదితర సభ్యులు పాల్గొన్నారు.

Related posts

కరోనాను జయించిన ములుగు యువకుడు

Satyam NEWS

Rules Changed: అంతర్జాతీయ క్రికెట్ లో కీలక నిబంధనల మార్పు

Satyam NEWS

పులిచింతలకు చేరుకున్న స్టాప్‌ లాక్‌ నిపుణుల బృందం

Satyam NEWS

Leave a Comment