39.2 C
Hyderabad
May 4, 2024 22: 19 PM
Slider హైదరాబాద్

మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అభివృద్ధి పనులు

#amberpet

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో అంబర్ పేట నియోజకవర్గ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. అంబర్ పేట డివిజన్ ప్రేమ్ నగర్ లోని భాష్యం స్కూల్ వద్ద సుమారు 35 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ శంఖుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, అంబర్ పెట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. గత పాలకులు నియోజకవర్గంలోని కనీస వసతులు లేక ప్రజల ఇబ్బందులు పడుతున్నప్పటికీ పట్టించుకోలేదని ఆరోపించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతున్న తరుణంలో అంబర్ పేట నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. సీపీఎల్ క్వార్టర్స్ నుండి ఆజాద్ నగర్, ప్రేమ్ నగర్ వరకు 15 లక్షల అంచనా వ్యయంతో 300/250/200 ఎంఎం హెచ్.డెబ్లు.జీ డ్రైనేజీ పైప్ లైన్, 8 లక్షల 50 వేల రూపాయల అంచనా వ్యయంతో మంచినీటి పైప్ లైన్, వడ్డెర బస్తీ నుండి మదర్సా మీదుగా అలీ కేఫ్ చౌరస్తా వరకు డ్రైనేజీ, మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

పనులను నాణ్యత లోపం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఆజాద్ నగర్, ప్రేమ్ నగర్ బస్తీల్లో అధికారులతో కలిసి ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

బస్తీలో మంచినీటి కోసం బోరు నీరు అందేలా తగిన మరమ్మతులు, నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలన్నారు. అదేవిధంగా వీధి దీపాలు సరిపడినన్ని ఉండేలా మాత్రమే కాకుండా కొన్ని ఎక్కువ ఉండేలా ఏర్పాటు చేయాలని అన్నారు.

ఇనుప కరెంటు స్తంభం బదులుగా సిమెంట్ కరెంటు స్తంభాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఎలక్ట్రిక్ అధికారులకు సూచించారు. వివిధ డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకుని అన్ని పనులు పూర్తయిన తరువాత బస్తీలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, జాప్యం లేకుండా పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డీజీఎం సతీష్, ఏఈ కుషాల్, జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సువర్ణ, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ, ఎలక్ట్రికల్ డీఈ వెంకటరమణ రెడ్డి, కాంట్రాక్టర్లు శ్రీశైలం, వెంకటేష్, ఎస్ఎఫ్ఐ సిబ్బంది పాష, భాస్కర్, ఉమేష్, బస్తీ వాసులు వెంకటేష్, ఆసిఫ్, గిరి, రాజ్, భాషా, నారాయణ, రాఘవేందర్, లక్ష్మి, స్వామి, యాదమ్మ, యాదగిరి, ఎండీ ఖాజా మోహిన్ మరియు టీఆర్ఎస్ పార్టీ అంబర్ పేట డివిజన్  అధ్యక్షుడు సిద్ధార్థ్ ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్ పేట

Related posts

మంత్రిని కలిసిన రోలార్ స్కేటింగ్ క్రీడాకారుడు

Satyam NEWS

అభివృద్ధి పనులు చూసి ఆకర్షితులవుతున్న నేతలు

Satyam NEWS

4723 చెక్కులకు గాను రూ.20.27కోట్ల పంపిణీ

Murali Krishna

Leave a Comment