26.7 C
Hyderabad
May 15, 2024 08: 58 AM
Slider నల్గొండ

రైతుబిడ్డ రాష్ట్రానికి నాయకుడైతేనే రైతులకు సంక్షేమ పథకాలు

#MLASaidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. కామాచి కుంట తండా, బీల్యానాయక్ తండ గ్రామాలలో MGNREGS నిధులు నుండి 12.60 లక్షల రూపాయలతో నిర్మించిన పల్లె ప్రగతి, డంపింగ్ యార్డ్, స్మశాన వాటికను ఆయన ప్రారంభించారు. కామచీ కుంట తండా లో DMFT నుండి 25 లక్షల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి శనివారం సైదిరెడ్డి శంఖుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పల్లె ప్రగతిని ప్రోత్సహిస్తూ రాబోయే తరాలు సస్యశ్యామలంగా ఉండాలని CM చిరకాల కోరిక అని ఆయన అన్నారు. పల్లె ప్రగతి ఒక మహా యజ్ఞంగా ప్రారంభించారని, ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేని స్మశాన వాటికలు (వైకుంఠధామలు) ఏర్పాటుకు కృషిచేసిన మహోన్నత వ్యక్తి కెసిఆర్  అని అన్నారు.

ప్రతి గ్రామపంచాయతీలో నిర్మించిన డంపింగ్ యార్డ్ నందు  గ్రామాలలో చెత్తాచెదారం వేరు చేసి ఎటువంటి అనారోగ్యాలను కలగకుండా చూసి డంపింగ్ యార్డ్ ను నిర్మించడం జరుగుతుందని సైదిరెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, రైతుబంధు రైతు భీమా, ఉచితంగా 24 గంటల కరెంటు మొదలైనవి ఒక్క మన రాష్ట్రంలోనే అవుతున్నాయని ఈ సందర్భంగా సైదిరెడ్డి గుర్తు చేశారు.

కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్, వృద్ధులకు  ఆసరా పింఛన్లు సకాలంలో అందిస్తూ ప్రతి కుటుంబంలో పెద్ద కొడుకుగా ఉన్నారని, ఇలాంటి ప్రభుత్వం మరి ఏ రాష్ట్రంలో లేదని అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలను అభివృద్ధి పథంలో ముందుంచుతున్న వ్యక్తి  ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.

Related posts

కల్వకుర్తిలో రెచ్చిపోయిన బియ్యం మాఫియా

Satyam NEWS

శాఖా సిబ్బందిపై విజయనగరం ఎస్పీ ఆగ్ర‌హం…..!

Satyam NEWS

శ్రీవారి ఆలయంలో రేపు కైశికద్వాదశి ఆస్థానం వేడుక

Satyam NEWS

Leave a Comment