39.2 C
Hyderabad
May 3, 2024 11: 33 AM
Slider హైదరాబాద్

కరోనా బాధితులకు ఆహారం అందించిన మున్నూరు కాపులు

#munnurukapu

లాక్ డౌన్ కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో  వివిధ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆకలితో అలమటిస్తున్న కరోనా బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు  4వ రోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు (కాపు)నిత్య అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆహారం అందచేసింది.

తెలంగాణ మున్నూరు కాపు (కాపు) సంఘం ఆధ్వర్యంలో  వద్దిరాజు రవిచంద్ర   పటేల్, కొండ దేవయ్య పటేల్, అల్లం కిషన్ రావు పటేల్, కొత్త లక్ష్మణ్ పటేల్  సహకారంతో

ఈ కార్యక్రమం నిర్వహించారు. హఫీజ్ పేట్ మున్నూరు కాపు సంఘం, శ్రీ కృష్ణా నగర్ మున్నూరు కాపు సంఘం ఈ కార్యక్రమానికి సహాకారం అందించారు. 

రంగారెడ్డి జిల్లా కొండాపూర్ ఏరియా ఆసుపత్రి, TIMS కొవిడ్ హాస్పిటల్ గచ్చిబౌలి, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ , పంజాగుట్ట NIMS హాస్పిటల్, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్,LB నగర్ ప్రభుత్వ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్ లలో అన్నదాన కార్యక్రమం జరిగింది.

కరోనా మహమ్మారి తో మరియు ఇతర  ఇబ్బందులతో పడుతున్నటువంటి వారికి, వారి బంధువులకు సుమారు 2000 మందికి భోజనం ప్యాకెట్లను  అందించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో బండి పద్మ, కాసారం రమేష్ నాయుడు, పెరిక రమేష్, వాసాల వెంకటేశ్వర్లు , వాసాల రాజు, గంప సురేష్ మరియు ఆఫీస్ పెట్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Related posts

చంద్రప్రభవాహనంపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌ స్వామి

Satyam NEWS

గృహలక్ష్మికి మూడు రోజులు మాత్రమే… మద్యం దుకాణాలకు ఇరవై రోజుల గడువా..?

Satyam NEWS

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ హీరో సాయిధరమ్‌ తేజ్‌

Satyam NEWS

Leave a Comment