38.2 C
Hyderabad
May 2, 2024 19: 12 PM
Slider మహబూబ్ నగర్

కల్వకుర్తిలో రెచ్చిపోయిన బియ్యం మాఫియా

#ricemill

రేషన్ రీసైకిలింగ్ వ్యాపారం చేసే మిల్లర్లు తెగించేస్తున్నారు. వారి వ్యాపారం కోసం ఎంతకైనా తెగించేందుకు వెనకాడడం లేదు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో  ఎల్లికల్ రహదారిలో ఉన్న శ్రీనిధి రైస్ మిల్ యజమాన్యం బుధవారం రాత్రి  రెచ్చిపోయి మిల్లు కాంపౌండ్ గేటుకు తాళాలు వేసి పదిమంది లారీ అసోసియేషన్ వ్యక్తులను తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందో నని హతమార్చడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. 

ప్రాణాలతో బయటపడ్డ వారు  ప్రాణాపాయ స్థితిలో ఉన్నామని బంధువులకు మిత్రులకు తెలియజేయడంతో అక్కడికి చేరుకున్న వారి బంధువులు మిత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. మిల్లులో దాదాపు 1000కింటల వరకు రెండు లారీలలో రేషన్ బియ్యం ఉన్నట్లు వారు తెలిపారు. బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు లారీ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం దిగువ తరగతి వారికి ఇచ్చే రేషన్ బియ్యాన్ని రీసైకిలింగ్ చేస్తూ కల్వకుర్తి పట్టణంలో రేషన్ మాఫియా రెచ్చిపోతున్నారని వారి ప్రాణాలను బీహార్ హమాలీలతో తీసి వేయించడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ రేషన్ మాఫియా మిల్లు యజమానికి దగ్గర బంధువు, ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ,మండల ప్రజా ప్రతినిధి ,వ్యాపారస్తుల సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి అండదండలతో కేసును తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. మిల్లు నుంచి బయటకు వెళ్లాలని మీడియా ప్రతినిధులను లారీ అసోసియేషన్ యజమాన్యాన్ని బెదిరించినట్లు, అధికారులు మిల్లు దగ్గర రావడానికి కాలయాపన చేయడానికి అతడే కారణమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పట్టణ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మిల్లు దగ్గరకు వచ్చిన  చాలాసేపటికి తాళాలు తీయించారని, మిల్లులో లైట్లు అన్ని బంద్ చేసి భయభ్రాంతులకు గురి చేశారని చంపేయండ్రా నరకయండ్రా అంటూ మిల్లు యజమాని హమాలీలతో ఆవేశంతో ఊగిపోయినట్లు వారు ఆరోపించారు. చివరకు అధికారులు మిల్లును సీజ్ చేశారు. అక్కడ ఉన్న రెండు లారీలను కూడా సీజ్ చేస్తామని పేర్కొన్నారు. గతంలో కూడా ఈ మిల్లుకు పక్కనే ఉన్న సాయి పారా బాయిల్డ్ మిల్లు యజమాని ఇద్దరు రిపోర్టర్ల పై హత్య ప్రయత్నం చేయడమే కాకుండా వారిపై తప్పుడు కేసులు నమోదు చేయించి గత ఎమ్మెల్యే అండదండలతో అప్పటి పోలీసుల సహాయ సహకారాలతో మిల్లు యజమాని తప్పించుకున్నాడు.

కల్వకుర్తిలో రేషన్ మాఫియా అటు పోలీస్ ఇటు సివిల్ సప్లై అధికారుల అండదండలతో ఆడిందే ఆటగా పాడిందే పాటగా వారి వ్యాపారాన్ని ఎదేచ్ఛగా కొనసాగిస్తున్నారనీ ఎంతమంది ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాధుడే కరవయ్యారని పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి  సీఎంఆర్ కింద వచ్చిన వడ్లను సైతం అమ్ముకొని ప్రభుత్వానికి టోకరా వేస్తున్నట్లు పలు పత్రికలలో కథనాలు వచ్చిన నేటికీ చర్యలు లేవు. మొత్తం మీద ప్రస్తుత కేసు ఏమలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.

Related posts

తెలంగాణ లో బీజేపీ ఎన్నికల శంఖారావం

Satyam NEWS

అక్రమ సంబంధం పర్యవసానంగా వివాహితపై విచక్షణారహిత దాడి

Satyam NEWS

మహాశక్తి ప్రారంభోత్సవ కార్యక్రమానికి తరలి వెళ్లిన తెలుగు మహిళ

Satyam NEWS

Leave a Comment