28.7 C
Hyderabad
May 6, 2024 10: 52 AM
Slider హైదరాబాద్

శేరిలింగంపల్లి లో చురుకుగా అభివృద్ధి కార్యక్రమాలు

#Arekapudi Gandhi MLA

హైదరాబాద్ శివారులోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వివేకానంద నగర్ డివిజన్ కూకట్ పల్లి డివిజన్ , ఆల్విన్ కాలనీ డివిజన్ లోని పలు కాలనీ లలో  సుమారుగా 51 లక్షల 25 వేల రూపాయల అంచనా వ్యయం తో చేపట్టబోయే మంజీరా మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు లక్ష్మి బాయి, జూపల్లి సత్యనారాయణ, దొడ్ల వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా అభివృద్ధి ఆగకూడదనే ఉద్దేశ్యంతో సిఎం కేసీఆర్ ఎన్నో ప్రణాళికలు వేస్తున్నారని అన్నారు. 

సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వ చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన అన్నారు. మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. శేరిలింగంపల్లి నియోకజకర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదితానని గాంధీ గారు పేర్కొన్నారు. అదేవిధంగా పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో రాజి పడకూడదని, శేరిలింగంపల్లి నియోజకవర్గం లో మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన మంచి నీరు అందించడమే ప్రభుత్వ ద్యేయం అని అన్నారు.

వాటర్ వర్క్స్ బోర్డ్  నిధుల ద్వారా మంజూరు అయిన నిధులతో చేపడుతున్న ఈ కొత్త పైప్ లైన్ కారణంగా కలుషిత నీటి సమస్య తీరుతుందని అన్నారు. మంచి నీటి సమస్య తలెత్తకుండా పవర్ బోర్లు ద్వారా కూడా సరఫరా చేస్తున్నామని, నియోజకవర్గం లో 18 రిజర్వాయర్ లు నిర్మాణం చేసుకున్నామని, ప్రజల దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :

1. వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని సుమిత్ర నగర్ లో HMWS బోర్డ్ నిధుల తో మంజూరైన సుమారుగా 19.55 లక్షల రూపాయల అంచనా వ్యయం తో చేపట్టే మంజీరా మంచి నీటి  పైప్ లైన్ నిర్మాణ పనులు.

2. వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని శాంతి నగర్ లో HMWS బోర్డ్ నిధుల తో మంజూరైన సుమారుగా 15.00 లక్షల రూపాయల అంచనా వ్యయం తో చేపట్టే మంజీరా మంచి నీటి  పైప్ లైన్ నిర్మాణ పనులు.

3.కూకట్పల్లి డివిజన్ పరిధిలోని బాలకృష్ణ నగర్ లో HMWS బోర్డ్ నిధుల తో మంజూరైన సుమారుగా 03.75 లక్షల రూపాయల అంచనా వ్యయం తో చేపట్టే మంజీరా మంచి నీటి  పైప్ లైన్ నిర్మాణ పనులు.

4. వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ లో HMWS బోర్డ్ నిధుల తో మంజూరైన సుమారుగా 04.95 లక్షల రూపాయల అంచనా వ్యయం తో చేపట్టే మంజీరా మంచి నీటి  పైప్ లైన్ నిర్మాణ పనులు.

5.ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని షంషీగూడ లో HMWS బోర్డ్ నిధుల తో మంజూరైన సుమారుగా 08.00 లక్షల రూపాయల అంచనా వ్యయం తో చేపట్టే మంజీరా మంచి నీటి  పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.

ఈ కార్యక్రమంలో HMWS అధికారులు వాటర్ వర్క్స్ మేనేజర్ వెంకటేశ్వర్లు ,వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి , కూకట్పల్లి డివిజన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ , ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్ , తెరాస నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు , రామారావు , కార్తీక్ రావు , నాగేశ్వర్ రావు, చంద్ర మోహన్ సాగర్ , విద్య సాగర్ , హరినాథ్ , కాశీనాథ్ యాదవ్ ,  మున్నా శాకత్ అలీ , కృష్ణ వేణి , తదితరులు పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ 2023 జెర్సీ విడుదల

Satyam NEWS

దేశంలోని రైతులందరికి రుణమాఫీ చేయాలి

Satyam NEWS

కొనసాగుతున్న భక్తుల రద్దీ

Bhavani

Leave a Comment