40.2 C
Hyderabad
May 2, 2024 16: 26 PM
Slider మహబూబ్ నగర్

ధరణి పోర్టల్ తో దారుణాలు జరుగుతున్నా పట్టించుకోరా?

#dharaniportal

ధరణి పోర్టల్ కారణంగా దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేర్ రైతులు ఆరోపించారు. తక్షణమే ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వారు కోడేర్ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షులు కె లింగన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కట్ట సత్యనారాయణ, తెలంగాణ ప్రజల పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. మురళీధర్ గుప్తా, ప్రదన కార్యదర్శి ఐనాల కృష్ణారావు, గారపాటి రామరాజు, MD.షరీఫ్, మహేష్,ఖాజా,శివ, బాలస్వామి,ఆంజనేయులు గౌడ్,కొమ్ము దానయ్య, భాస్కర్,మైబుష్ వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ధరణి పోర్టల్ లో ఎదురవుతున్న ఇబ్బందులను భూముల లావాదేవీలలో సమస్యలను తొలగించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారన్నారు. ధరణి లోని లోపాల కారణంగా కుటుంబ కలహాలు కుట్రలు కుతంత్రాలు వివాదాలు ఘర్షణలు హత్యలు ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి ఇన్ని దారుణాలు జరుగుతున్న బంగారు తెలంగాణలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడడం లేదు.

1. భూముల వివరాలు తప్పుగా నమోదు కావటం

2. తప్పుగా నమోదు అయినా పట్టాదారు పేరు వివరాలను సరిచేయడం

3. పొరపాటున పట్టా భూములు ప్రభుత్వ భూములు గా నమోదు అయినందున వాటిని సరి చేయుట

4. మిస్సింగ్ సర్వే నెంబర్లు

5. భూమి విస్తీర్ణం సరిచేయడం

6. ఒకరి కంటే ఎక్కువ కొనుగోలుదారులను అమ్మకందారుల ను అనుమతించడం.

7. ధరణిలో ఫిర్యాదులకు సమయం ఇచ్చి ఆన్లైన్లోనే సరిదిద్దడం

8. కొన్ని పట్టా భూములను ప్రభుత్వ భూముల గాన దేవాదాయ భూదాన్ భూములు గా నమోదు అయిన వాటిని సరిదిద్దేందుకు అవకాశం ఇవ్వడం

9. ఇనాం భూములకు సంబంధించి నీలో మార్పులకు అవకాశం కల్పించాలి ఆక్యుపెన్సీ రైడ్స్ సర్టిఫికెట్ సర్టిఫికెట్ ప్రొటెక్షన్ సర్టిఫికెట్ కొత్తగా ఇవ్వాలంటే ప్రస్తుతం ధరణి లో అవకాశం లేదు కావున ధరణి లో అవకాశం కల్పించాలి

10. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకం లో భూమి విస్తీర్ణం తప్పుగా నమోదు కావడం

11. కొన్ని సందర్భాలలో భూమి పట్టాదారు యజమాని కాలంలో లో మరో పేరు రావడం జరిగింది ఇలా భూమి యాజమాన్యాలకు బదులు ఇతరుల పేర్లు నమోదు అయిన సందర్భాలలో ప్రస్తుతం ఎందుకు అవకాశం లేదు వాస్తవానికి భూమికి సంబంధించి ఎలాంటి హక్కులు లేకపోయినా ధరణిలో పేరు వచ్చిన తర్వాత ఎవరు స్వచ్ఛందంగా పేరు మార్పునకు సహకరించడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో అసలు భూ యజమానులకు కు కోర్టుకు వెళ్లడం తప్పా వేరే గత్యంతరం లేదు ఇలాంటి ఇ పొరపాట్లను సరిదిద్దేందుకు ధరణి లోనే అవకాశం కల్పించాలి

12. రాష్ట్రంలో ప్రభుత్వ అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చినప్పటికీ ధరణి లో నమోదు చేయలేదు దీనితో పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందినవారు ఇబ్బందులకు గురవుతున్నారు ధరణిలో పట్టాలు పొందిన రైతుల పేర్లు మార్చేందుకు ఈ అవకాశం కల్పించాలని కోరుతున్నారు

13. రాష్ట్రంలో కొన్ని చోట్ల ప్రభుత్వ భూమి పట్టా భూములు గా నమోదు కావడం పట్టా భూములు ప్రభుత్వ భూములు నమోదు కావడం జరిగింది ఇలాంటి పొరపాటు సరిదిద్దేందుకు కు అవకాశం ధరణిలో కల్పించాలి

14. భూమికి ఆధార్ నెంబర్ అనుసంధానం కాకముందే ఎవరైనా రైతు చనిపోయి ఉంటే మా భూమి వివరాలు ధరణి లో నమోదు కాలేదు

15. రైతులు తమ అవసరాలకు తమ భూమిలో కొంత భూమిని విక్రయించి మిగతా భూమిని ఉంచుకుంటే ధరణిలో విక్రయించిన రైతు ఉంచుకున్న కొంత భూమి కూడా విక్రయించినట్లు ధరణిలో చెప్పడం జరిగింది

16. ధరణి అమలతో పొజిషన్ సర్టిఫికేట్ ను నిలుపుదల చేయడంతో 50 సంవత్సరాల కు పైగా అనుభవంలో ఉన్న కూడా రైతులు భూమిపై తమ హక్కులు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

17. భూమి కొనుగోలు చేసి పట్టా పొందినప్పటికీ భూమి ధరణికోట లో నమోదు చేయలేదు మొదటి పట్టాదారు నుండైనా తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే అతనిపై కూడా సగం భూమి లేదా పూర్తిగా తొలగించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

దాదాపు రెండు సంవత్సరాలుగా రైతులు సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు భూముల లావాదేవీలు పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో తీసుకువచ్చిన ధరణి పోర్టల్ అనేక సమస్యలతో సామాన్య ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది ధరణి సమస్యల పరిష్కారానికి గౌరవనీయులు మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో మంత్రులతో సబ్ కమిటీ ప్రభుత్వం నియమించింది ధరణి సమస్యలపై చర్చించి నివేదిక ఇచ్చేందుకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిశీలించి ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది కమిటీ నివేదిక నెలలు గడుస్తున్నా ధరణి సమస్యలు పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ధరణిలో సమస్యలు పరిష్కరించాలి.

ధరణిలో భూపరిపాలన సేవలు ఉచితం కాదు ప్రతి పనికి ఒక రేటు మీ పేరు తప్పుగా నమోదు అయిందా మీ తండ్రి పేరులో అక్షరం తేడా ఉందా కులం ఇంటి పేరు విస్తీర్ణం తక్కువగా ఉందా ఓ సర్వే నెంబరు ఇలాంటి తప్పులు సరి చేసుకోవడానికి దరఖాస్తు చేయాలంటే రూపాయల 1000 ఫీజు చెల్లించాల్సిన దే దరఖాస్తును తిరస్కరిస్తే మళ్లీ ఫీజు కట్టాల్సిందే ఇలా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎన్ని సార్లు తిరస్కరిస్తే అన్ని సార్లు చెల్లించాల్సిందే.

ధరణి కి ముందు మాకు ఎలాంటి సమస్యలు లేవని ఇప్పుడు మేము ఫీజులు ఎందుకు చెల్లించాలి అంటే అది కుదరదు భూమి రికార్డులు చేసింది ఎవరు రైతుల వారి పేర్లు తప్పుగా రాసుకున్నారా వారి భూమి నీ వారే ఎ ఎక్కువ అ తక్కువలు చేసుకున్నారా పట్టా పాస్ పుస్తకం జారీ చేసింది ఎవరు అందులో తప్పుడు డాటా ఎంట్రీ చేసింది ఎవరు ఇవన్నీ చేసింది రెవెన్యూ ఉద్యోగులు వీటిని సవరించడానికి  రైతులు ఫీజులు ఎందుకు చెల్లించాలి ప్రభుత్వం దిని కి సమాధానం చెప్పాలి గతంలో భూమి యజమాని మరణాంతరం ఎలాంటి ఫీజు లేకుండా విరాసత్ ద్వారా వారసులకు పట్టా మార్పిడి జరిగేది ప్రస్తుతం ఒక ఎకరాకు 2500 రూపాయలు ఎన్ని ఎకరాలు ఉంటే అన్నీ చెల్లించాల్సిందే

భూ పరిపాలన సేవలను ఉచితంగా దించాల్సిన ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఫీజులను వసూలు చేస్తున్నది దీని ద్వారా ప్రతి ఏటా కోట్లల్లో ఆదాయము సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నది ఓవైపు ప్రభుత్వం ధరణి అద్భుతం కీర్తిస్తూనే కొత్త కొత్త ఆప్షన్ తీసుకువస్తూ రైతులను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారు

ధరణిలో తప్పుడు డాటా ఎంట్రీ చేసి ఇ రైతుల ఇబ్బందులకు కారణమైన నా అధికారులు ఉద్యోగులపై చర్యలు తీసుకొని సమస్యల పరిష్కారం కోసం నిర్ణయించిన ఫీజులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్ జిల్లా

Related posts

ఆర్ధిక పతనం: అధిక వడ్డీ చెల్లిస్తేకానీ పుట్టని అప్పు

Satyam NEWS

సీఎం సొంత జిల్లాలో నడి రోడ్డుపై నే స్విమ్మింగ్ పూల్

Satyam NEWS

విశాఖ ఉక్కును అమ్మే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు

Satyam NEWS

Leave a Comment