27.7 C
Hyderabad
May 4, 2024 08: 11 AM
Slider జాతీయం

డిహెచ్ఎల్ఎఫ్ ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వాద్వాన్ అరెస్టు

#DHLF Deeraj Wadwan

ఎస్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి డిహెచ్ఎల్ఎఫ్ ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వాద్వాన్ లను సీబీఐ అరెస్టు చేసింది. ఎస్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించిన నాన్ బెయిలబుల్ వారంట్ వీరిపై పెండింగులో ఉంది. వాద్వాన్ కుటుంబం మొత్తం మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్ లో వేసవి విడిదిలో ఉండగా సీబీఐ అరెస్టు చేసింది.

మొత్తం 10 మంది కుటుంబ సభ్యులు ఆ సమయంలో అక్కడ ఉన్నట్లు సతారా పోలీసులు తెలిపారు. సతారా పోలీసులు కపిల్, ధీరజ్ లను కష్టడీలోకి తీసుకుని సీబీఐ పోలీసులకు అప్పగించారు. అక్కడ నుంచి రక్షణ కల్పించి వారిని ముంబయి కి తరలించారు. ఎస్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి మార్చి 7న సిబిఐ ఎస్ బ్యాంకు చైర్మన్ రానా కపూర్, కపిల్ ధీరజ్ లపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

విచారణ ప్రారంభం అయిన నాటి నుంచి కపిల్, ధీరజ్ కపూర్ లు పరారీలో ఉన్నారని సీబీఐ తెలిపింది. మార్చి 9న వారి ఇళ్ల పై సీబీఐ దాడి జరిపినా వారు దొరకలేదు. దాంతో వారికి మార్చి 17న లుకౌట్ నోటీసు జారీ చేశారు. వీరిపై ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసింది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలోనే వీరు సీనియర్ ఐపీఎస్ అధికారి హోం శాఖ ముఖ్య కార్యదర్శి అమితాబ్ గుప్తా నుంచి ఒక లేఖ తీసుకుని వివిధ రాష్ట్రాలు తిరిగినట్లు కూడా ఆధారాలు సేకరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం గుప్తా ను నిర్భంద సెలవుపై పంపారు. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారు.

Related posts

కార్మికుల హక్కుల కోసం ఐ.ఎన్.టి.యు.సి ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం

Satyam NEWS

వర్షానికి ఆటో బోల్తా: యువతి మృతి

Satyam NEWS

అచ్చెంనాయుడిపై పోలీసు కేసు నమోదు

Satyam NEWS

Leave a Comment