27.7 C
Hyderabad
April 30, 2024 08: 56 AM
Slider ముఖ్యంశాలు

కార్మికుల హక్కుల కోసం ఐ.ఎన్.టి.యు.సి ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం

#INTUC

ఐ.ఎన్.టి.యు.సి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగని నాగన్న గౌడ్.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తున్న తరుణంలో కార్మికుల హక్కులు,ఉజ్వల భవిషత్తు కొరకు ఐ.ఎన్.టి.యు.సి ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని  ఐ.ఎన్.టి.యు.సి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగని నాగన్న గౌడ్ హెచ్చరించారు.

భారత కార్మిక చట్టలలో ప్రధానమంత్రి మోడీ కార్మిక వ్యతిరేక మార్పులు చేసి అనేక అంశాలలో అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలు,ప్రాథమిక సూత్రాలు,పని వద్ద హక్కులు మునుపటి కార్మిక చట్టాలలో పొందుపరచబడిన సామాజిక న్యాయాన్ని దెబ్బతీసాడని నాగన్న మండిపడ్డారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బలమైన ఐ.ఎన్.టి.యు.సి,ఇతర కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించడంలేదని, ఇటీవలే చాల ప్రభుత్వరంగ సంస్థలలో జరిగిన ఉద్యోగా,కార్మిక సంఘాల ఎన్నికల్లో ఐ.ఎన్.టి.యు.సి విజయ బావుటా ఎగురవేసింది గుర్తు చేసారు.

మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి పెద్దఎత్తున కార్మికుల మద్దతు ఐ.ఎన్.టి.యు.సి కి లభించడం శుభ పరిణామమని,కార్మికుల మద్దతుతో మోడీ కార్మిక వ్యతరేక విధానాలను తిప్పికొడతామని అన్నారు .హైదరాబాద్ నారాయణగూడ లో గురువారం  ఐ.ఎన్.టి.యు.సి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఐ.ఎన్.టి.యు.సి జాతీయ కార్యదర్శి ఆర్.డి.చంద్రశేఖర్,ఐ.ఎన్.టి.యు.సి తెలంగాణ రాష్ట్ర నేతలు ఎస్.నరసింహా రెడ్డి, గోదా మల్లేష్ గౌడ్,భాస్కర్ రెడ్డి లతో కలసి యరగని నాగన్న గౌడ్ మాట్లాడారు. 

భారతదేశంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి డాక్టర్ జి.సంజీవ రెడ్డి చేసిన నిరంతర కృషి కార్మికులకు ఎంతో ప్రయోజనం కలిగిందని,అదే స్పూర్తితో తెలంగాణలో కార్మికుల హక్కులకోసం,ఉద్యోగ భద్రత, సామాజిక రక్షణకు సంఘటిత, అసంఘటిత కార్మికులను ఏకం చేసి ఉద్యమాలు నిర్మిస్తామని వెల్లడించారు.  రాష్ట్రంలోని,జిల్లాలో,పట్టణాల్లో హక్కుల కోసం ప్రతి కార్మికుడిని కలసి చైతన్యం కల్పిస్తూ,ఐ.ఎన్.టి.యు.సి బలోపితానికి కృషి చేస్తున్నామని యరగని నాగన్న గౌడ్ అన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

మద్యం అమ్మకాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి

Satyam NEWS

ఏసిబి నివేదికతో దుర్గగుడి ఈవో సురేష్ పై వేటు?

Satyam NEWS

పరువు హత్య జరగకుండా చొరవ తీసుకున్న పోలీసులు

Satyam NEWS

Leave a Comment