30.3 C
Hyderabad
March 15, 2025 09: 44 AM
Slider ప్రపంచం

నెవర్ ఎండింగ్: ఉత్తర కొరియా అధినేత కిమ్ బతికే ఉన్నాడు

#Kim Jugn Un

ఉత్తర కొరియా అధినేత కిమ్ జంగ్ ఉన్ బతికే ఉనాడని దక్షిణ కొరియా అధ్యక్షుడి అత్యున్నత భద్రతా అధికారి మూన్ ఛాంగ్ యిన్ వెల్లడించారు. కిమ్ మరణించాడనే పుకార్లను ఆయన ఖండించారు. తాత జయంతి వేడుకల తర్వాత కనిపించకుండా పోయిన కిమ్ మరణించినట్లు పుకార్లు వ్యాప్తి చెందాయి.

అప్పటి నుంచి విస్తృతంగా చర్చ నడుస్తున్నది. అమెరికా కు కూడా ఈ అంశంపై కచ్చితమైన సమాచారం లేదు. నేడు దక్షిణ కొరియా చేసిన ఈ ప్రకటనతో కొంత మేరకు అనధికారికంగానైనా స్పష్టత వచ్చినట్లయింది. కిమ్ తన దేశంలోని తూర్పు ప్రాంతంలోని వోన్సన్ లోని ఒక రిసార్టులో ఉంటున్నాడని కూడా ఛాంగ్ యిన్ తెలిపారు.

ఉత్తర కొరియా లోని ప్రముఖ ఆన్ లైన్ మీడియా డైలీ ఎన్ కె కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. కిమ్ గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నారని, ఇప్పుడు కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారని ఆ ఆన్ లైన్ మీడియా వెల్లడించింది.

Related posts

నారాయణగూడా ట్రాఫిక్ సి.ఐ.వెంకన్నకు సన్మానం                                            :

Satyam NEWS

తెలంగాణ ఉద్యమ నేత పిడమర్తి రవికి MLC ఇవ్వాలి

Satyam NEWS

బ్రహ్మపుత్ర నదిని ఆపేస్తున్న చైనా

Satyam NEWS

Leave a Comment