30.7 C
Hyderabad
May 5, 2024 04: 29 AM
Slider జాతీయం

దక్షిణ భారత రైతు సంఘాల సమావేశంలో తెలంగాణ పథకాలపై విస్తృత చర్చ

#farmers

కేరళ రాష్ట్రం కన్నూరు జిల్లాలోని చెఱుపూజా పట్టణంలో  దక్షిణ భారతదేశ రైతు సంఘాల సమావేశం రెండు రోజుల పాటు ఈనెల 20,21 తేదీల లో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా రాకేష్ తికాయత్ సంయుక్త  కిసాన్ మోర్చాలు నాయకులు  బి కే యూ అధికార ప్రతినిధి పాల్గొన్నారు. దక్షిణ భారత దేశ రైతు సంఘాల అధ్యక్షులు కోటపాటి నరసింహం నాయుడు అధ్యక్షత వహిస్తున్నారు. 

తెలంగాణ నుండి ఖమ్మం జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు తమిళనాడు నుండి A.S బాబు VKSK  సెంథిల్ కుమార్ ఈషాన్, వి.స్వామినాథ్ కర్ణాటక రైతు రాజ్య అధ్యక్షులు బనవరాబ్  కేరళ నుండి జోసఫ్ యం పుత్తుసెర్రీ మాజీ శాసనసభ్యడు పిటి జాన్ పాల్గొని ఆయా రాష్ట్రాల సమస్యలు చర్చించి , అన్ని రాష్ట్రాలలో తెలంగాణ మోడల్ రైతు బంధు,రైతు భీమా వంటి పథకాలు అమలు కార్యాచరణ రూపొందించి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

వచ్చేనెల 19న చెన్నైలో మరొకమారు సమావేశమై దేశవ్యాప్తంగా తెలంగాణ రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుకు  కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. ముఖ్యంగా దేశాలలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతుబంధు, రైతు బీమా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ,ఉచిత విద్యుత్తు,  పంట కొనుగోలు తదితర పథకాలు సమర్ధంగా అమలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినంద నీయుడు  అని రాకేష్ తికాయత్ అభిప్రాయ పడ్డారు.  దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు , కేరళ , ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ స్థాయిలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమ కార్యచరణ రూపొందించారు.

Related posts

శాంతిభద్రతలు కాపాడటం చేతకాని జగన్ రెడ్డి

Satyam NEWS

రాత్రి పూట గంటస్తంభం సాక్షిగా డ్రంక్ అండ్ డ్రైవ్…!

Satyam NEWS

ఆడపిల్ల కుటుంబానికి ప్రభుత్వం భరోసా

Satyam NEWS

Leave a Comment