37.2 C
Hyderabad
May 6, 2024 20: 24 PM
Slider

ఆడపిల్ల కుటుంబానికి ప్రభుత్వం భరోసా

#KCR government

ఆడపిల్ల కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం భరోసా ఇస్తుందని, కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాల ద్వారా ఆడపిల్ల పెళ్లికి లక్ష నూట పదహారు రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 449 మందికి 4,49,52,084 రూపాయల కళ్యాణలక్ష్మి, షాది ముభారాక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 8,346 మందికి 83,16,35,816 రూపాయల కల్యాణలక్ష్మి, షాదిముభారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పెద్దలాగ ఒక.లక్ష నూట పదహారు రూపాయలను ఈ పథకాల ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆడపిల్లల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు పోయాయని, ఆడపిల్లలను సైతం మగ పిల్లవానితో సమానంగా పెంచాలని తల్లిదండ్రులకు సూచించారు.

Related posts

జగన్ జైలుకెళితే మొదట సంతోష పడే వ్యక్తి పెద్దిరెడ్డి

Satyam NEWS

ఫైర్ ఎగెన్: మళ్లీ కదిలిన కాపు రిజర్వేషన్ అంశం

Satyam NEWS

చంద్రబాబు పిలుపు మేరకు వరద బాధితులకు డాక్టర్ కడియాల సాయం

Satyam NEWS

Leave a Comment