33.2 C
Hyderabad
May 15, 2024 11: 31 AM
Slider వరంగల్

డాన్ బాస్కో పిల్లలకు బ్లాంకెట్లు పంపిణీ

వరంగల్ లోని డాన్ బాస్కో వీధి బాలల వసతి గృహం పిల్లలకు అనురాగ్ హెల్పింగ్ సొసైటీ, రోటరీ క్లబ్ హన్మకొండ యుక్త ఆధ్వర్యంలో నోట్ బుక్స్, దుప్పట్లు అందచేశారు. చలి పెరగడం తో పిల్లల సౌకర్యార్ధం దుప్పట్లు, బట్టలు కూడా దించామని అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్, నేషనల్ కన్జుమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ పేదరికం విద్య కు ఆటంకంకారాదని, పిల్లలకు విద్య అనేది వారి హక్కు అని అన్నారు. విద్య తో పాటు పిల్లలకు మంచి నడవడిక, మంచి బుద్ధులు,సంస్కృతి ప్రదాయాలను నేర్పించాలని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించవచ్చని తగిన సహాయ సహకారాలు అందిస్తామని రోటరీ సభ్యులు తెలిపారు. పిల్లలు పాటలు పాడి అలరించారు. ఈ కార్యక్రమం లో రోటరీ క్లబ్ సభ్యులు కరుకాల రామ్ రెడ్డి, బేతి రవీంద్ర రెడ్డి, రాజు, దివ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

కేంద్రం సొమ్మును హైజాక్ చేస్తున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

బుద్దదేవ్ ఆరోగ్యం విషమం

Bhavani

స్పెషల్: టీటీడీ ఈవోగా జె ఎస్ వి ప్రసాద్ కు గ్రీన్ సిగ్నల్?

Satyam NEWS

Leave a Comment