42.2 C
Hyderabad
May 3, 2024 18: 37 PM
Slider ముఖ్యంశాలు

బుద్దదేవ్ ఆరోగ్యం విషమం

#Buddhadev

సీపీఎం కురువృద్ధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్యం విషమించింది. కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఆయనకు డాక్టర్లు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు.

డాక్టర్లు అత్యాధునిక చికిత్సను అందిస్తోన్నప్పటికీ.. ఆరోగ్య పరిస్థితి కుదుటపడట్లేదు. దీంతో బుద్ధదేవ్ ను వెంటిలేటర్‌పై ఉంచారు. 79 సంవత్సరాల వయస్సున్న బుద్ధదేవ్ భట్టాచార్య.. లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, టైప్ 2 శ్వాసకోస సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు.

ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. బుద్ధదేవ్‌ వైద్య ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇది వరకే ప్రకటించారు. 79 ఏళ్ల బుద్ధదేవ్‌ భట్టాచార్య 2000-2011 వరకు బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదు. అందుకే ప్రజా జీవితానికి దూరమయ్యారు. 2019లోనూ ఆయన శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. అయితే ఆ సమయంలో త్వరగా కోలుకున్నారు.

Related posts

బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం రోజు కుమ్ములాటలు

Satyam NEWS

ఆపదలో ఉన్న బాలలకు అమృత హస్తం చైల్డ్ లైన్ -1098

Satyam NEWS

నెల్లిమర్ల లాకప్ డెత్ కేసులో ఎస్ఐ పై సస్పెన్షన్ వేటు

Satyam NEWS

Leave a Comment