Slider ఖమ్మం

అర్హులకు ఇళ్ల స్థలాల పంపిణీ

#Collector V.P

జిల్లాలో భూసేకరణ చేసి ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి అర్హులైన నిరుపేదలకు 75 గజాల నివాసయోగ్యమైన ఇండ్లస్థలాల పట్టాల పంపిణీకి చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ రెవెన్యూ అధికారులను

ఆదేశించారు. ఐడిఓసి స్పూర్తి వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుండి తహశీల్దార్లు, రెవెన్యూ డివిజనల్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్హులైన వారి జాబితాను రూపొందించి

లబ్ధిదారులకు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జాబితా రూపొందించే క్రమంలో పారదర్శకత పాటించాలని, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్‌, 9వ తేదీన అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో

పట్టాల పంపిణీ సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ ఎన్‌.మధుసూదన్‌, భూసేకరణ విభాగం పర్యవేక్షకులు రంజిత్‌కుమార్‌, కలూరు రెవెన్యూ డివిజలనల్‌ అదికారి సూర్యనారాయణ, ఆయా మండలాల నుండి తహశీల్దార్లు పాల్గొన్నారు.

Related posts

పాక్ లో పని చేయని ప్రభుత్వ ఉద్యోగుల్ని తీసేసే చట్టం

Satyam NEWS

ఇళ్లను కాదు ఊళ్లనే కడుతున్నజ‌గ‌న్ ప్రభుత్వం

Satyam NEWS

మురుగుపారు…పశువులు సేద తీరు…

Bhavani

Leave a Comment