42.2 C
Hyderabad
April 26, 2024 16: 00 PM
Slider ప్రపంచం

పాక్ లో పని చేయని ప్రభుత్వ ఉద్యోగుల్ని తీసేసే చట్టం

#Imran Khan

పని చేయని ప్రభుత్వ ఉద్యోగులను తీసివేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. పని చేయకుండా జీతం తీసుకుంటున్న వారిని గుర్తించి వారిని బలవంతంగా ఉద్యోగాల నుంచి తీసేసేందుకు ఈ చట్ట సవరణ వీలు కలిగిస్తుంది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సివిల్ సర్వెంట్స్ (డైరెక్టరీ రిటైర్ మెంట్ సర్వీస్ ) రూల్స్ 2020 చట్టం తీసుకువచ్చారు.

ప్రభుత్వంలోని ఒకటి నుంచి 19వ గ్రేడ్ ఉద్యోగుల వరకూ ఈ కొత్త చట్టం వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం పదవీ విరమణ వయసుతో పని లేకుండా పని చేయని వారిని రిటైర్ అయినట్లుగా భావించి ఉద్యోగాల నుంచి తొలగిస్తారు. పాకిస్తాన్ లో ప్రభుత్వ సిబ్బంది రిటైర్ మెంట్ వయసు 60 సంవత్సరాలుగా ఉంది.

Related posts

నీట్, జేఈఈ ప్రాక్టీస్ టెస్ట్స్ సిద్ధం

Sub Editor

క్లీన్ చిట్: మత్తు మందుల కేసులో ఎవరూ లేరు

Satyam NEWS

ముగిసిన శ్రీ సుందరరాజస్వామివారి అవ‌తారోత్స‌వాలు

Satyam NEWS

Leave a Comment