26.2 C
Hyderabad
May 10, 2024 19: 52 PM
Slider పశ్చిమగోదావరి

ఏపిలో డీకేసీ పర్యటన: ఉత్కఠ రేపుతున్న షర్మిల రాజకీయం

#DKC

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని గత కొద్ది రోజులుగా వెలువడుతున్న వార్తలను నిజం చేస్తూ కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి కె శివకుమార్ పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం వస్తున్నారు. అక్కడ ఒక శివాలయం నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. కర్నాటక కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక వ్యక్తి ఉండ్రాజవరానికి చెందిన వారు.

ఆయన కోరిక మేరకే డికె శివకుమార్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. రాజమండ్రి వరకూ విమానంలో వచ్చిన ఆయన అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఉండ్రాజవరం చేరుకుంటారు. డికె శివకుమార్ అకస్మాత్తుగా ఏపి పర్యటనకు రావడంతో

గత కొద్ది రోజుల నుంచి వస్తున్న ఊహాగానాలు నిజమని పిస్తున్నది. తెలంగాణ లో రాజకీయ పార్టీ పెట్టిన వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపి సీఎం వై ఎస్ జగన్ సోదరి వై ఎస్ షర్మిల గత కొద్ది రోజులుగా డికేసీ తో టచ్ లో ఉన్నారు.

బెంగళూరులో ఆస్తులు ఉన్న షర్మిలకు డీకేసీతో చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాల నేపథ్యంలో కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో డీకేసీ ఉప ముఖ్యమంత్రి అయ్యారు.ఆయన మధ్యవర్తిత్వం వహించి షర్మిలను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాతో మాట్లాడించారు.

ప్రియాంక చేసిన ప్రతిపాదనలకు షర్మిల సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో షర్మిల అతి త్వరలో కాంగ్రెస్ కీలక నాయకుడు రాహుల్ గాంధీతో సమావేశం కాబోతున్నారని తెలిసింది. రాహుల్ గాంధీతో

సమావేశం అనంతరం కాంగ్రెస్, షర్మిల తెలంగాణలో పెట్టిన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టే వీలుంది. ఆమెకు ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్

కమిటీ అధ్యక్షురాలిగా కూడా అవకాశం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అన్న జగన్ తో విభేదాలు తీవ్రం కావడంతో షర్మిల రాజకీయంగా తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. షర్మిల ఆంధ్రా కాంగ్రెస్ లో కీలక పాత్ర

పోషించేదిశగా ముందుకు కదులుతున్నారని ఇప్పటికే స్పష్టం అయింది. డికెసీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జిగా ఉండి ఈ ప్లాన్ మొత్తాన్ని అమలు చేస్తారని చెబుతున్నారు. డీకేసీ ప్రయత్నాలు ఫలిస్తే షర్మిల ఏపి కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించే అవకాశం కూడా ఉంది.

Related posts

సాగులో ఉన్న దళితుల భూమిలో ఇండస్ట్రియల్ పార్క్ వద్దు

Bhavani

కొల్లాపూర్ లో గుట్టుగా సాగుతున్న పేకాట స్థావరం

Satyam NEWS

రన్నింగ్ కామెంట్రీ: ప్రజలు ఫిర్యాదు చేస్తే అనర్హత వేటు వేస్తారా?

Satyam NEWS

Leave a Comment