27.7 C
Hyderabad
April 30, 2024 10: 15 AM
Slider పశ్చిమగోదావరి

సాగులో ఉన్న దళితుల భూమిలో ఇండస్ట్రియల్ పార్క్ వద్దు

#Dalit land

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామంలో కొంతమంది భూమిలేని నిరుపేద దళితులు గ్రామం లో సర్వే నంబర్ 141 లో గల 370 ఎకరాల ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈ భూమిని ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఎస్టేట్ పార్కు క్రింద ఈ భూమిని కేటాయించింది. ఎన్నో ఏళ్లుగా ఆ భూమిని సాగుచేసుకుని జీవిస్తున్నామని, ఆ భూమిని ఇండస్ట్రియల్ పార్క్ కి కేటాయించి మా నోటికాడ జీవనాధారం గా ఉన్న మా సాగులో ఉన్న భూముల లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయ వద్దని జి కొత్తపల్లి గ్రామ నిరుపేదలు కలెక్టర్ కు సోమవారం స్పందనలో వినతి పత్రం అందజేశారు.

గ్రామంలో 270 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాల కింద పట్టాల పంపిణీ చేయడం జరిగిందని మిగిలిన 100 ఎకరాల్లో నిరుపేదలు సాగు చేసుకుంటున్నట్టు గ్రామస్తులు కలెక్టర్ కు తెలిపారు. అయితే ప్రభుత్వం ఇటీవల సాగులో ఉన్న భూమిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుందని తెలిపారు.

దీనిపై మండల రెవెన్యూ అధికారికి ఎన్ని సార్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా తహసీల్దార్ స్పందించక పోవడంతో జిల్లా కలెక్టర్ ఆశ్రయించామని నిరుపేద దళితులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా కుటుంబాల్లోనే ఆడపిల్లలకు పెళ్లి చేసిన నేపథ్యంలో కొంతమంది ఈ భూములను కట్నాల కింద ఇస్తున్నామని అన్నారు.

ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ఆపాలని వారు కోరుతున్నారు. స్పందనలో కలెక్టర్ కి పిర్యాదు చేసిన వారిలో బోడ దుర్గారావు గండి వెంకటలక్ష్మి ఆడ బాల కోటయ్య పి రామరావు చిన్న మాణిక్యం తదితరులు ఉన్నారు.

Related posts

రిక్వెస్టు: నా పుట్టిన రోజు సంబరాలు జరపవద్దు

Satyam NEWS

అందరినీ మెప్పించే పిల్లల వినోదం : హౌస్ అరెస్ట్

Satyam NEWS

రవితేజ డిస్కో రాజా తొలి సాంగ్ విడుదల

Satyam NEWS

Leave a Comment