29.7 C
Hyderabad
April 29, 2024 09: 33 AM
Slider నల్గొండ

బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కార్మికులు సిద్ధం కావాలి

#CITU

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజు.సెంట్రల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్(సి ఐ టి యు) దేశంలో అనేక పోరాట ఫలితంగా కార్మిక చట్టాలను, హక్కుల్ని సాధించిన ఘనత సిఐటియుకి మాత్రమేనని బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సి ఐ టి యు అనుబంధ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజు అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సి ఐ టి యు 53వ,ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ నేడున్న బిజెపి మత విద్వేష పరిపాలన,మతోన్మాదంతో పాటు కార్మిక వ్యతిరేక విధానాలు,కార్మిక చట్టాలను

రద్దు చేయడం,కార్పోరేట్లకు బడా పెట్టుబడిదారులకు,స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలమైన లేబర్ కోడ్ లను సృష్టించడం,కార్మిక వర్గాన్ని అణిచివేస్తున్న బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికవర్గం ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాబోయే కాలంలో అన్ని రకాల కార్మికులను సమీకరించి కనీస వేతన సాధన,పని గంటల

తగ్గింపు హక్కుని నిలుపుకోవాలని అన్నారు.మతోన్మాద బిజెపి ని వెనక్కి కొట్టకపోతే కార్మిక వర్గానికి గొడ్డలిపెట్టు అయ్యే పరిస్థితిలు ఉన్నాయని, రాబోయే కాలంలో ఐక్యంగా పోరాడి హక్కులు సాధించే దిశగా కార్మిక వర్గం పనిచేయాలని కార్మికులను కోరారు.

ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్,జిల్లా నాయకులు చల్లా జయకృష్ణ,ఉపతల్ల వెంకన్న,పల్లపు రామకృష్ణ,శీలం వేణు,గుండు వెంకన్న, ధారా శ్యామ్,అశోక్,అక్బర్,అఖిల్ కుమార్, సురేష్,వెంకన్న,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి
హుజూర్ నగర్

Related posts

వైఎస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్షను భగ్నం చేయడం అప్రజాస్వామికం

Satyam NEWS

సాక్షి మీడియా ప్రచారంపై షర్మిల ఫైర్

Satyam NEWS

తెలంగాణలో లాక్ డౌన్ 30 వరకూ పొడిగింపు

Satyam NEWS

Leave a Comment