28.2 C
Hyderabad
May 9, 2024 01: 28 AM
Slider నల్గొండ

హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా డి.ఎల్.పాండు

#dlpandu

చిన్నతనం నుండి కృషి పట్టుదలతో ఎదిగిన వ్యక్తి,26 సంవత్సరాలు న్యాయవాద వృత్తిలో శ్రమజీవి అయిన   డి.ఎల్.పాండు ముదిరాజు కు రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా ఎన్నిక కావడం,ఉమ్మడి రాష్ట్ర ముదిరాజులు గర్వించదగ్గ విషయమని సీనియర్ కార్మిక నాయకుడు శీతల రోషపతి కొనియాడారు.

ఈ సందర్భంగా శీతల రోషపతి మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో ఉంటూ ఆర్థికంగా లేని వారికి ఉచితంగా న్యాయస్థానంలో వాదించిన వ్యక్తిగా,ముదిరాజులు బిసి డి నుండి బిసి ఏ గ్రూపులోకి మార్చాలని గల్లి నుండి ఢిల్లీ వరకు పోరాడిన వ్యక్తి డి.ఎల్ పాండు ముదిరాజ్ అని అన్నారు.రాష్ట్రం లోని కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్,జోర్క్ జగన్ ముదిరాజ్ తో పాటు డి.ఎల్. పాండు ముదిరాజ్  బిసి డి గ్రూపు నుండి  బిసి ఏ గ్రూపులోకి మార్చాలని దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వారాల కొద్దిగా ఉండి పోరాడిన ఫలితంగా సుప్రీంకోర్టు ఈనెల అక్టోబర్ 11,2022 తేదీన బిసి డి గ్రూప్ నుండి ఏ గ్రూపులోకి మార్చాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం గర్వించదగ్గ విషయమని,వీరి కృషి ఉమ్మడి రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరని రోషపతి అన్నారు. హైదరాబాదు లోని హయత్ నగర్ కాలనీలో న్యాయవాది పాండు స్వగృహంలో శాలువాకప్పి,పూలమాలలతో సన్మానించి, సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అవతా సైదులు ముదిరాజు,బంధువులు,మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

జగన్ జిల్లాల పర్యటన కోసం బుల్లెట్ ప్రూఫ్ బస్సులు

Satyam NEWS

హార్డ్ స్టోరీ: కరోనా కబళిస్తున్న జీవితాలు ఇవి

Satyam NEWS

జగన్ పార్టీ నుండి లీడర్లు పారిపోవడం షురూ!

Satyam NEWS

Leave a Comment