27.7 C
Hyderabad
May 4, 2024 08: 29 AM
Slider వరంగల్

బిఆర్ఎస్ నాయకులను నమ్మి మరోమారు మోసపోవద్దు

#seetakka

బిఆర్ఎస్ నాయకుల మాయ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నే ఇందిరమ్మ రాజ్యం సాధ్యమని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేసి నన్ను అత్యంత మెజార్టీతో గెలిపించాలని ములుగు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క ప్రజలను కోరారు. ములుగు నియోజకవర్గంలోని మంగపేట మండలం లోని చుంచుపల్లి, పాలయిగూడెం గ్రామాలలో సీతక్క గురువారం  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం లో భాగంగా మంగపేట మండలo లోని చుంచుపల్లి , పాలయిగూడెం గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించరు.

ఈ సందర్భంగా సీతక్క  మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ , పోడు భూములకు పట్టాల కోసం ఎన్నో సార్లు అసెంబ్లీ లో మాట్లాడడం వల్లనే ఈరోజున  పట్టాలు వచ్చాయని  సీతక్క  అన్నారు. కష్టం వచ్చిన కరోనా వచ్చిన కన్నీళ్లు వచ్చిన మీకు అండగా ఉన్నది నేను ఓట్లు రాగానే వచ్చి మాయమాటలు చెప్పి ఓట్లు దండు కావాలని చూస్తున్న బిఆర్ఎస్ నాయకులను అని అన్నారు. గత పదేళ్లుగా టిఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి మోసపోతున్నామని మరోసారి వారి మాటలు నమ్మి మోసపోవద్దని సీతక్క ప్రజలకు గుర్తు చేశారు.

నమ్మి మరోమారు మోసపోవద్దని సీతక్క ప్రజల గుర్తు చేశారు. గడిచిన 10 యేండ్ల కెసిఆర్ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే ,  డబుల్ బెడ్ రూం ఇవ్వళే , దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలే ,  ఫీజ్ రీయంబర్స్ మెంట్ ఇవ్వాళే , రైతు రుణమాఫీ చేయాలే  , ఏ ఒక్క హామీ నిలబెట్టుకొని టీఆర్ఎస్ పార్టీని చిత్తగా ఓడించి కాంగ్రెస్ పార్టీని అత్యంత మెజార్టీతో గెలిపించాలని సీతక్క ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రవేశపెట్టిన  ఆరు గ్యారంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తామని  హామీ ఇచ్చారు. 

అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్ల ద్వారా నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఎస్సి, ఎస్టీ లకు 6 లక్షల రూపాయలు కల్పిస్తాం అని, ఇండ్ల స్థలాలు లేని వారికి ఉచితంగా 250 గజాల ఇళ్ళ స్థలాన్ని కేటాయించి ఇల్లు నిర్మిస్తామని అన్నారు. అసలు బి.ఆర్.ఎస్.పార్టీ పేదల కోసం సంక్షేమ పథకాలు ఇచ్చారా లేక పార్టీ కోసం ఇచ్చారో అర్థం కావట్లేదని, పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు పంచడం దారుణం అని అన్నారు. నియంత పాలనను అంతమొందించి పేదల పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.

Related posts

పూరీ లో మాదిరిగా విజయనగరంలో జగన్నాధుని రథయాత్ర…!

Bhavani

లావణ్య మరణానికి కారణమైన మహిళ గుర్తింపు

Satyam NEWS

లాక్ డౌన్ బందోబస్తు పరిశీలించిన స్టీఫెన్ రవీంద్ర

Satyam NEWS

Leave a Comment