31.7 C
Hyderabad
May 7, 2024 02: 45 AM
Slider నల్గొండ

హుజూర్ నగర్ లో పేదల ఇళ్లను కూలిస్తే మీ పతనం తప్పదు

#roshapati

అనేక సంవత్సరాల నుండి ఎన్.ఎస్.పి. కాలవ ప్రక్కన గుడిసెలు వేసుకొని జీవిస్తున్న సుమారు 150 కుటుంబాల ప్రజలు, కార్మికులకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా దౌర్జన్యంగా ఇండ్లను కూల్చడం సరైంది కాదని ఇది  హుజూర్ నగర్ పట్టణంలో చెదరని ముద్రని,ఈ పరిణామానికి అధికార పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి విమర్శించారు.

ఎన్.ఎస్.పి. కాలవ ప్రక్కన నిరాశ్రయులైన కార్మికులు,ప్రజలతో కలిసి మాట్లాడుతూ రాత్రి కరెంటు లేక పిల్లలతో రోడ్లమీద ఉంటున్నారని,ఇది చాలా అన్యాయమని,కుటుంబ సభ్యులతో ఏడుస్తూ ఆవేదన తెలిపారని,నారు లేక అల్లాడు సాయిరాం గౌడ్,ప్రసాద్ గౌడ్ లు భోజనాలు పెట్టి ఆదుకున్నారని,ఆర్.డి.ఓ భరోసా ఇవ్వాలని,సమాధానం చెప్పాలని అన్నారు.

గతంలో శాసనసభ్యుడుగా, మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు బైపాస్ రోడ్లు,డబల్ బెడ్ రూమ్ కట్టించిచారని, కానీ నేటి వరకు అర్హులైన పేదలకు వాటిని పంచక పోవటం కారణం ఏంటో చెప్పాలని,ఈ నియోజకవర్గంలో చిన్న గ్రామాలలో డబల్ బెడ్ రూమ్ ఇస్తున్నారని,కానీ హుజూర్ నగర్ పట్టణంలో పేద ప్రజలు ఏంద్రోహం చేశారో చెప్పాలని అన్నారు.తక్షణమే ఇల్లు కూల్చిన కుటుంబాలకు రక్షణ ఏర్పాటు చేయాలని వాళ్ల రేకులు ఇటుకలు ప్రతి కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలని,లేకపోతే ఇండ్ల నిర్వాసితులు తిరుగుబాటు చేస్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో చింతలచెరువు శాంతమ్మ,చింతల సూర్య,పసుపులేటి జింకల సూర్యం,మంగమ్మ,రాజేష్,లక్ష్మి, కనకయ్య,రవి,గోవిందమ్మ,రాజ్యం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే శారీరకంగా దృఢంగా ఉండాలి

Satyam NEWS

సంగీత క‌ళా న‌గ‌రంలో ల‌తామంగేష్క‌ర్ అవార్డు గ్ర‌హీత‌చే హిందుస్థానీ క‌చేరీ

Satyam NEWS

భారత సాయుధ త్రివిధ దళాల కొత్త అధిపతి ఎవరు

Sub Editor

Leave a Comment