Slider హైదరాబాద్

అంబర్పేటలో ఆందోళన బాట పట్టిన పారిశుద్ధ్య కార్మికులు ……

#sanitaryworkers

అంబర్ పేట నియోజక వర్గం లోని జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగంలో బయోమెట్రిక్ మిషిన్ పని చేయకపోవడంతో దీంతో విధులకు హాజరైన సిబ్బందికి గైర్హాజర్ పడుతుందని దీంతో జీతంలో కోత విధిస్తున్నారని జీహెచ్ఎంసీ దీన్ని నిరసిస్తూ అంబర్ పేట, గోల్నాక, నల్లకుంట, బాగ్ అంబర్పేట, కాచిగూడ డివిజన్ లలో విధులను నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు విధు బహిష్కరించి ధర్నా నిర్వహించారు.

గత రెండు నెలల నుంచి నాలుగు వేల రూపాయలు కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి నెల నాలుగు సార్లు  బయోమెట్రిక్ మిషన్ పని చేయడం లేదని వారు తెలిపారు. దీంతో జోనల్ కమిషనర్ ను సంప్రదించగా పైఅధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తమ సమస్యలను మంత్రి కేటీఆర్  స్పందించి తమకు న్యాయం చేయాలని జీహెచ్ఎంసీ కార్మికులు వేడుకున్నారు. ప్రతిరోజు ఐదు గంటలకు లేచి ప్రజా శ్రేయస్సు కోసం కష్టపడే కార్మికులకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకునే నాథుడు లేడు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

మల్కాజ్‌గిరి ఏసీపీ ఇంట్లో దొరికింది ఎంతో తెలుసా?

Satyam NEWS

ఆంధ్రాలో 24 గంటల కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు: కేసీఆర్

Satyam NEWS

గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలి

Satyam NEWS

Leave a Comment