40.2 C
Hyderabad
May 5, 2024 17: 04 PM
Slider వరంగల్

వరంగల్, హన్మకొండ, కాజీపేట.. ట్రై సిటీస్ విడదీయవద్దు

#bandi sudhakar

కాకతీయులు ఏలిన ఘనమైన చరిత్ర కలిగిన వరంగల్, హన్మకొండ, కాజీపేట మహానగరాలను (ట్రైసిటీస్) విడదీయవద్దని, ఇపుడు ఉన్నట్లుగానే ఒకే జిల్లా కింద ఉంచాలని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. 

ఈ మేరకు ఆయన బుధవారం హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు వినతి పత్రాన్నిచ్చారు.

రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరమే అతి వేగంగా అభివృద్ధి చెందిందని, కాకతీయ విశ్వవిద్యాలయం, నిట్ యూనివర్సిటీ, ఉత్తర – దక్షిణ భారత దేశానికి వారధి అయిన కాజీపేట జంక్షన్, ఎన్నో కార్పొరేట్ ఆస్పత్రులు, విద్యాలయాలు, వాణిజ్య సంస్థలు, మామునూరు ఎయిర్ పోర్టు ఉన్నదని, ఇన్ని సౌకర్యాలున్న వరంగల్ మహా నగరాన్ని ప్రభుత్వం విడదీసి, వేర్వేరు జిల్లాల పరిధిలోకి తెచ్చే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బండి పేర్కొన్నారు.

భవిష్యత్ లో ఓరుగల్లు చరిత్రను కాలగర్భంలో కలపాలని చూస్తున్నారని, విడదీతను ఆపివేసి, ఒకే జిల్లాలో కొనసాగించాలని బండి సుధాకర్ గౌడ్ సీఎస్ ను కోరారు.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, ప్రజాభిప్రాయం మేరకు నడుచుకోవాలని బండి సుధాకర్ గౌడ్ డిమాండ్ చేశారు.

Related posts

ఎబివిపి కార్యవర్గంలో కొల్లాపూర్ విద్యార్ధినేతలు

Satyam NEWS

నాగర్ కర్నూల్ జిల్లాలో 217 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు

Satyam NEWS

ఇళ్ల కేటాయింపు కోసం తిరుపతి జనసేన నిరసన

Satyam NEWS

Leave a Comment