30.7 C
Hyderabad
April 29, 2024 04: 42 AM
Slider పశ్చిమగోదావరి

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్

#heartyculture

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో హార్టికల్చర్  ఔట్ సోర్సింగ్ స్టాప్ నల్ల బాడ్జ్ లు పెట్టుకుని నిరసన తెలిపారు.

ఏ పి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జె ఏ సి  పిలుపు మేరకు విధులకు హాజరౌతూనే  నిరసన గళం విప్పారు. తమ డిమాండ్ ల పరిష్కారానికై గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో  ఆందోళన కార్యక్రమాలు  నిర్వహిస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా జె ఏ సి నేత బాబ్జి బుధవారం తెలిపారు.

జిల్లాలో ఏలూరు, జంగారెడ్డిగూడెం లలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన అన్నారు.

ప్రభుత్వం తమ డిమాండ్ల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని పశ్చిమగోదావరిజిల్లా జె ఏ సి నాయకులు బాబ్జి కోరారు.

ప్రభుత్వం స్పందించకపోతే  తదుపరి కార్యాచరణ పై జె ఏ సి అత్యవసర సమావేశం కానుందని బాబ్జి తెలిపారు.

Related posts

రాబోయే రెండు రోజుల్లో విస్తారంగా వర్షాలు

Satyam NEWS

కేబినెట్ విస్తరణపై సీఎం జగన్ కసరత్తు ప్రారంభం

Satyam NEWS

రుణ విత‌ర‌ణ మ‌హోత్స‌వం: సామాన్యుల‌కు సులువుగా రుణాలివ్వండి

Satyam NEWS

Leave a Comment