28.7 C
Hyderabad
May 6, 2024 02: 34 AM
Slider ప్రత్యేకం

కొత్త సంవత్సరం రోజున పుట్టినవారు ఎందరో తెలుసా?

new baby

నూతన సంవత్సరం తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది జన్మించారని, ఇందులో అత్యధికులు ఇండియాలోనే పుట్టారని యునిసెఫ్ వెల్లడించింది. మొత్తం 3,92,078 మంది జనవరి 1న జన్మించారని, అందులో 67,385 మంది ఇండియాలో పుట్టారని పేర్కొంది.

జననాల విషయంలో అత్యధికంగా జనాభా ఉన్న చైనాను భారత్ అధిగమించిందని, చైనాలో న్యూ ఇయర్ ఫస్ట్ డేన 46,299 మంది పుట్టారని పేర్కొంది. ఫిజీలో 2020 సంవత్సరపు తొలి బేబీ జన్మించిందని వెల్లడించిన యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా ఫోరే, మొత్తం జననాల్లో సగం మంది ఎనిమిది దేశాల్లోనే పుట్టారని వెల్లడించారు. ఇండియా, చైనాలతో పాటు నైజీరియా (26,039), పాకిస్థాన్ (16,787), ఇండోనేషియా (13,020), యూఎస్ఏ (10,452), డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (10,247) ఇథియోపియా (8,493) జననాలను చూశాయని తెలిపారు.

గత సంవత్సరం జన్మించిన చిన్నారుల్లో 25 లక్షల మంది పుట్టిన నెల రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారని, నెలలు నిండకుండానే పుట్టడం, డెలివరీ సమయంలో వచ్చే సమస్యలు, ఇన్ఫెక్షన్లు సోకడం ఇందుకు కారణమని హెన్రిటా ఫోరే తెలియజేశారు. గడచిన మూడు దశాబ్దాల కాలంలో చిన్నారుల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోందని ఆయన తెలిపారు.

Related posts

విశాఖపట్నం కలెక్టర్ కు సిఎం జగన్ ప్రశంస

Satyam NEWS

విదేశాల్లో విద్యను అభ్యసించే స్థాయికి తీసుకువెళతాం

Bhavani

సిలువగిరి కొండపై ఒక వ్యక్తి దారుణ హత్య

Bhavani

Leave a Comment