40.2 C
Hyderabad
May 5, 2024 17: 51 PM
Slider విజయనగరం

పోలీసు బాస్ ఆధ్వర్యంలో జరిగిన “స్పందన”కు వచ్చిన బాధితులు ఎంతమందో తెలుసా….!

#police boss

ఖాకీ దుస్తులు ధరించిన వారిలో పోలీసులు కూడా ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఖాకీ రంగు దుస్తులు ధరించిన పోలీసులలో కొంతమంది ప్రవర్తన కారణం గా శాఖకే మచ్చ తెచ్చిపెడుతున్నారు.ఇక్కడ ఈ సోది ఎందుకు “సత్యం న్యూస్. నెట్” ప్రస్తావిస్తోందంటే..ఆ కొంతమంది అనాలోచిత నిర్ణయాలు.. ఆవేశ పూరితమైన చర్యలతో వాళ్లు నిర్వర్తిస్తున్న విధులతో పాటు తోటి సిబ్బంది… తద్వారా సమాజం పై తీవ్ర ప్రభావం చూపుతుంది.

కానీ రెవిన్యూ శాఖ మాదిరిగా నే పోలీసు శాఖలో కూడా “స్పందన” కార్యక్రమం తీసుకుని…పోలీసులంటే ప్రజలతో మమేకం అవుతున్నామని పోలీసు అధికారుల చర్యలు ద్వారా చెప్పే యత్నం చేస్తోంది.. పోలీసు శాఖ.కానీ పోలీసు అంటే బాధితుని బాధలను సమూలనంగా రూపుమాపడమే పోలీసు విధి అని…ఫిర్యాదు రూపంలో తన వద్దకు వచ్చిన వారికి ఓ భరోసా.. ఓ ధైర్యం ఇచ్చే యత్నం చేస్తున్నారు…

ఏపీ రాష్ట్రంలో ని విజయనగరం జిల్లా కు ఏడాదిన్నర క్రితం ఎస్పీగా వచ్చిన ఎం.దీపికా పాటిల్. ప్రతీ వారం మాదిరిగా నే ఈ వారం కూడా జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన “స్పందన” లో బాధితుల నుంచీ ఫిర్యాదులు తీసుకుని ..అక్కడికక్కడే వాళ్ల ముందే..వాళ్ల ఎదురుగానే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి…అక్కడికక్కడే వాస్తవాలను తెలుసుకుని…చర్యలు చేపడుతున్నారు.

అందులో భాగంగా ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.ఇలా బాధితుల సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. “స్పందన” కార్యక్రమంలో భాగంగా ఎస్పీ 24 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

❇️ విజయనగరం మండలం పడాలపేటకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన వ్యాపార
అవసరాల నిమిత్తం వై.ఎస్.ఆర్.నగర్ కు చెందిన వ్యక్తి వద్ద 5.50 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు, తాను
తిరిగి చెల్లించే సమయంలో అధిక వడ్డీ వసూలు చేస్తున్నారని, తాను వ్యాపారంలో నష్టపోవడంతో, తనను,
ఇతర కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ
విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాలని విజయనగరం రూరల్ సీఐను ఆదేశించారు.

❇️ బొబ్బిలి మండలం పారాదికి చెందిన ఒకామె జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేస్తూ తనకు వారసత్వంగా
సంక్రమించిన భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని, తనకు చెందిన
వ్యవసాయ భూమిని దౌర్జన్యంగా దున్నేస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన
జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని బొబ్బిలి సిఐను
ఆదేశించారు.

భీమిలి మండలం అల్లుపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన తల్లి కూర
గాయల వ్యాపారం చేస్తుందని, కూరగాయలు తీసుకొని మోదవలస జంక్షన్ వద్ద ఆటో ఎక్కగా, సదరు ఆటో
తిరగబడి, తన తల్లికి కాలు విరిగిపోయిందని, సదరు ఆటో డ్రైవరుతో రాజీ ప్రయత్నం ఫలించక పోవడంతో,
కేసు నమోదు చేసి, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట
పరమైన చర్యలు తీసుకోవాలని డెంకాడ ఎస్ఐను ఆదేశించారు.

❇️ విజయనగరం కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను నెల్లిమర్ల మండలం
కొత్తపేట గ్రామ పరిధిలో లే-అవుట్ వేసి, సదరు ఫ్లాట్లు అన్నింటిని విజయనగరం పట్టణానికి చెందిన
వ్యక్తులకు 50 లక్షలకు విక్రయించినట్లు, సదరు వ్యక్తి 5 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చి, మిగిలిన
45 లక్షలు చెల్లించడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ
విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం 2వ పట్టణ
సిఐను ఆదేశించారు.

❇️ మెరకముడిదాం మండలం గర్భాం కి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తమను రాజాం
కు చెందిన కొంతమంది వ్యక్తులు నమ్మించి, మోసం చేసి, 30 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు, తిరిగి
డబ్బులు చెల్లించడం లేదని, ఈ విషయమై వారిని ప్రశ్నిస్తే, బెదిరింపులకు పాల్పడుతున్నారని, న్యాయం
చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు తీసుకొని,
ఫిర్యాదికి న్యాయం చేయాలని బుదరాయవలస ఎస్ఐను ఆదేశించారు.

❇️ విజయనగరంకి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన కోడలు తమకు చెప్పకుండా
సుమారు 40తులాల బంగారు ఆభరణాలు తీసుకొని వారి కన్నవారింటికి వెళ్ళిపోయిందని, ఈ విషయమై
పెద్దల సమక్షంలో తిరిగి ఇచ్చేందుకు అంగీకరించినా, ఇంత వరకు నగలు ఇవ్వలేదని, న్యాయం చేయాలని
కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి
న్యాయం చేయాలని విజయనగరం 1వ పట్టణ సిఐను ఆదేశించారు.

ఇలా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు
చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను, వెంటనే తనకు నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ
ఎం.దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ మరియు ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డిఎస్పీ
ఆర్.శ్రీనివాసరావు, డిసిఆర్బి సిఐ జె. మురళి, ఎస్బీ సిఐలు సిహెచ్. రుద్రశేఖర్, జి.రాంబాబు, ఎస్ఐ వాసుదేవ్
లు పాల్గొన్నారు.

Related posts

ప్రజల ఫిర్యాదులకు సత్వరమే పరిష్కారం చూపాలి

Satyam NEWS

మోక్షజ్ఞ ఎంట్రీ దసరా నుంచేనా ??

Bhavani

క్వారంటైన్ నిబంధన తొలగించిన బ్రిటన్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment