33.7 C
Hyderabad
April 28, 2024 00: 19 AM
Slider కడప

భావన టౌన్షిప్ పై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలి

#Bhavana Township

కడప నగరం చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు పొలం మూల వంక వద్ద ప్రభుత్వ భూముల్లో నిర్మిస్తున్న భావన టౌన్షిప్ అక్రమాలపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని, కడప జిల్లా అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం కడప కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షల్ని బీసీ మహాసభ అఖిలభారత నాయకులు,అవ్వారు మల్లికార్జున ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి, టిడిపి నాయకులు హరిప్రసాద్, బిసి మహాసభ నాయకులు అవ్వరు మల్లికార్జున, ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ నాయకులు జేవి రమణ, సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర, జనతాదళ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రతాపరెడ్డి, ఎమ్మార్పీఎస్ నాయకులు మాతయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నజీర్ అహ్మద్ మాట్లాడుతూ, ఊటుకూరు గ్రామ పొలంలోని ప్రభుత్వ భూమిని బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీ భూమిగా మార్చి బుద్ధ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ మాఫియా స్వాహా చేసిందని ధ్వజమెత్తారు.

ఈ భూముల్లో భావన టౌన్షిప్ పేరు తోటి భారీ వెంచర్ వేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూముల్లో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ మాఫియా అక్రమ వ్యాపారం చేస్తుంటే జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం ఆశ్చర్యం అని విమర్శించారు. నేషనల్ హైవే రోడ్డుని ఆక్రమించుకొని చుట్టూ కాంపౌండ్ కట్టి స్వాధీనం చేసుకున్నారని అయినా అధికారులు కనులప్పగించి చూడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిలో రియల్ ఎస్టేట్ మాఫియా ఇస్టాను సారంగా అమ్మేస్తుంటే ప్రభుత్వం చేతగాని తనంతో చూస్తూ ఊరుకోండి పోవడం సమంజసం కాదన్నన్నారు. ఇప్పటికైనా ఈ భూములపైన పూర్తిస్థాయి రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ చేయాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది.

దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత

ప్రభుత్వ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకొని భావన టౌన్ షిప్ పేరుతోటి భారీ వెంచర్ నిర్మిస్తున్నారని అఖిలపక్షం చేపట్టిన నిరాహార దీక్ష దగ్గర కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పోలీస్ అధికారులు అనుమతి తీసుకుని దీక్షలు ప్రారంభించిన గంటన్నరకే డిఎస్పీ నాయకత్వాన సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీక్షలు చేస్తే గొడవలు జరుగుతాయని, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తాదని దీక్షలు విరమించాలని చెప్పడం తో అఖిలపక్ష నాయకులు తిరస్కరించారు. ఈ సందర్భంగా పోలీసులకి అఖిలపక్ష నేతలకు మధ్య తీవ్ర వాగ్యుద్దం జరిగింది. అనంతరం డిఎస్పి కలెక్టర్ దగ్గరికి అఖిలపక్ష నాయకుల్ని తీసుకుపోయి చర్చలు జరిపారు. దీంతో సమస్య సద్దుమణిగింది.

వారం రోజుల్లో విచారణ పూర్తి చేస్తాం కలెక్టర్.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారం రోజుల విచారణ పూర్తి చేసి ఎండార్స్మెంట్ అఖిలపక్షం అందజేస్తామని హామీ ఇచ్చి దీక్షలు విరమింప చేశారు. అనంతరం అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు విచారణ పూర్తి చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోతే ఆ భూములను పండగ తర్వాత తిరిగి ఉద్యమం పెద్ద ఎత్తున చేపడతామని హెచ్చరించారు. అనంతరం దీక్షలు విరమించారు.

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అమీర్ బాబు, నగర అధ్యక్షులు శివకొండారెడ్డి, చింతకొమ్మదిని మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, గంధం మోహన్, రవిశంకర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి వెంకట శివ, మల్లికార్జున, భాగ్యలక్ష్మి, బ్రహ్మం, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాసరావు, ఆర్ సి పి జిల్లా కార్యదర్శి శేఖర్, చింతకొమ్మదిన్నె మండల కార్యదర్శి ప్రసాద్, నాయకులు చాపల సుబ్బరాయుడు, లక్ష్మీదేవి, తస్లీమ్, రాజు, అజయ్, బాల చెన్నయ్య, వెంకటేష్, ఆర్ ఎస్ వై ఫ్ రాష్ట్ర కార్యదర్శి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

War is on: రష్యాను ఓడించడం అసాధ్యం

Satyam NEWS

# NotMyKing: బ్రిటన్ లో రాజుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు

Satyam NEWS

వెయ్యి మంది మహిళలతో బతుకమ్మ సంబురాలు

Satyam NEWS

Leave a Comment