40.2 C
Hyderabad
May 1, 2024 16: 06 PM
Slider హైదరాబాద్

అక్రమ అరెస్ట్ లు కాదు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలి

#AIIF

ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఛలో ప్రగతిభవన్ కార్యక్రమానికి విద్యార్థి,యువజన సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర కార్యాలయం మఖ్దుం భవన్ ని రాత్రి పోలీస్ లు చుట్టిముట్టడం,ఫోన్ ట్యాప్ లు, అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాలను ఆపలేరని ఎస్ఐ , కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేసే వరకు పోరాటం ఆగదని ఏఐవైఏఫ్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు , సయ్యద్ వలి ఉల్ల ఖాద్రీ, కసిరెడ్డి మణికంఠ రెడ్డి తెలిపారు

ఈరోజు ఉదయం మఖ్దుం భవన్ వద్ద AIYF రాష్ట్ర అధ్యక్షుడు Dr సయ్యద్ వలి ఉల్ల ఖాద్రీ,AISF రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి లను అక్రమ అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీసు స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ సందర్బంగా సయ్యద్ వలి ఉల్ల ఖాద్రీ,మణికంఠ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఛలో ప్రగతిభవన్ కార్యక్రమానికి బయలుదేరిన వందలాది విద్యార్థి,యువజన నాయకులను నిన్న రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగిందనీ న్యాయం చేయాలనీ కోరుతున్న విద్యార్థి , యువజన నాయకులను, అభ్యర్థులను అరెస్ట్ చేయడంలో చూపిస్తున్న

శ్రద్ధ, ఎస్ఐ,కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్య పరిష్కారంలో చూపిస్తే బాగుండు అని ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని 1600/800 పరుగు పందెంలో ఉతీర్ణత సాధించిన ఎస్ ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులందరికి మెయిన్స్ పరీక్ష అవకాశం కల్పించాలనీ ప్రిలిమ్స్ ప్రాథమిక మల్టీపుల్ పరీక్షలో తప్పుగా వచ్చిన 7 ప్రశ్నలకు మార్కులు కలపాలని హైకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులను

అమలు చేయని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మెన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రిలిమ్స్ పరీక్షలలో తప్పుగా వచ్చిన ప్రశ్నలన్నింటికీ మార్కులను కలపాలని సయ్యద్ వలి ఉల్ల ఖాద్రీ ,మణికంఠ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.

Related posts

భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా రూరల్ సీఐకి సత్కారం

Satyam NEWS

50 శాతం అదనపు ఛార్జీతో సంక్రాంతికి 1266 ప్రత్యేక బస్సులు

Satyam NEWS

టూర్:పాకిస్తాన్ అధ్యక్షునితో శత్రుఘన్ సిన్హా మీట్

Satyam NEWS

Leave a Comment