28.7 C
Hyderabad
May 6, 2024 08: 52 AM
Slider గుంటూరు

భార్యను వేధిస్తున్న డాక్టర్ భర్త అరెస్టు

#gunturpolice

గుంటూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేసే వైద్యురాలిని భర్త వేధింపులకు గురిచేసాడు. భర్త పెట్టే బాధలను భరించలేక మహిళా డాక్టర్ దిశ SOS కాల్ చేసి ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన గుంటూరు లోని సీతారామ నగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డా.ఉమా దేవి గుంటూరు లోని విశ్వా హాస్పిటల్ లో వైద్యురాలిగా పనిచేస్తోంది. తన భర్త ఉపేంద్ర కూడా అదే హాస్పిటలో డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి మధ్య గత కొంత కాలంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున డా.ఉమా దేవిని భర్త ఉపేంద్ర కొట్టడం జరిగింది. భయంతో బాధితురాలు దిశ SOS కు కాల్ చేసి సహాయం కోరింది. బాధిత మహిళ దిశ SOS కు కాల్ చేసిన పది నిముషాల వ్యవధిలో పోలీసులు లోకేషన్ కు చేరుకున్నారు. భార్య ఉమాదేవి పై చేయి చేసుకొని గొడవ పడుతున్న భర్త ఉపేంద్రను పోలీసులు అదుపు చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో పదేపదే తనతో భర్త గొడవ పడుతున్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. డా.ఉమాదేవి ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా భర్త ఉపేంద్ర పై చర్యలు తీసుకుంటామని ఓల్డ్ గుంటూరు పోలీసులు పేర్కొన్నారు.

Related posts

భారీగా పెరిగిన పంచాయతీ ఎన్నికల నామినేషన్లు

Satyam NEWS

సబ్బండ వర్గాల సంక్షేమమే బీఆర్‌ఎస్ ధ్యేయం

Satyam NEWS

అశ్వ వాహన సేవలో సౌమ్యనాధ స్వామి…

Bhavani

Leave a Comment