37.2 C
Hyderabad
May 2, 2024 14: 48 PM
Slider అనంతపురం

భారీగా కర్ణాటక మద్యం పట్టివేత

#anathapur

అనంతపురం జిల్లా SEB అడిషనల్ ఎస్పీ రామ క్రిష్ణ అదేశాల మేరకు అనంతపురం SEB ఇన్స్పెక్టర్ R. రవిచంద్ర సిబ్బందితో  అనంతపురం  రుద్రంపేట బైపాస్ వద్ద విశ్వసనీయమైన సమాచారం మేరకు  అదివారం వాహన తనిఖీ నిర్వహిస్తుండగా, రెండు ఆటోలలో  కర్ణాటక మద్యం అక్రమంగా తరలిస్తూ ఇరువురు వ్యక్తులు పట్టుబడ్డారు. అనంతపురం రూరల్ రుద్రంపేట కు చెందిన యాగంటి హరీష్, చంద్రబాబు నగర్ కు చెందిన T. వెంకటేష్ లుగా వారిని పోలీసులు గుర్తించారు.

ఇరువురూ చెరో ఆటోలో కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నందు పలు వైన్ షాపులలో ఒక్కరూ  4 కార్టన్ బాక్సుల మద్యం కొనుగోలు చేసి వెనుక సీట్ క్రింద పెట్టుకొని అనంతపురంలో అధిక ధరతో అమ్ముతుంటారు. అక్రమంగా రవాణా చేస్తూ అనంతపురం SEB అధికారులకు రుద్రంపెట వద్ద పట్టుబడ్డారు. ఆ ఇద్దర్నీ అరెస్ట్ చేసి, 8 బాక్సులలో   మొత్తం 768 హేవార్డ్స్ చీర్స్ విస్కీ టెట్ర పాకెట్స్ మద్యంను, రెండు ఆటో లను సిజ్ చేసి అనంతపురం SEB స్టేషన్ నందు కేస్ నమోదు చేయడమైనది. తదుపరి జుడిసియల్ రిమాండ్ కు తరలించడమైనది. ఈ దాడులలో అనంతపురం SEB ఇన్స్పెక్టర్ R. రవిచంద్ర, SI M. మునిస్వామి మరియు  సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

జులై 3న దేశవ్యాప్త నిరసనలను జయప్రదం చేయండి

Satyam NEWS

రెండవ రోజు ఒంటిమిట్ట కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

సైబర్ సేఫ్టీ పై జాన్సన్ గ్రామర్ స్కూల్ లో వర్క్ షాప్

Satyam NEWS

Leave a Comment